Telangana : గౌడ, ఎస్సీ, ఎస్టీలకు మద్యం దుకాణాలు కేటాయింపు
తెలంగాణలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు మద్యం దుకాణాలను కేటాయించారు. గౌడ, ఎస్ సి, ఎస్టీలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు కేటాయించామని మంత్రి శ్రీనివాస్ గౌడ్ తెలిపారు.

Liquor shops allotted : తెలంగాణలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు మద్యం దుకాణాలను కేటాయించారు. రాష్ట్ర వ్యాప్తంగా గౌడ, ఎస్ సి, ఎస్టీలు ఆర్ధికంగా పరిపుష్టి సాధించేందుకు మద్యం దుకాణాలను లాటరీ ద్వారా కేటాయించినట్లు రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి వి.శ్రీనివాస్ గౌడ్ తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి హైదరాబాద్ లో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడ, ఎస్సీ, ఎస్టీ కమ్యూనిటీలకు 756 దుకాణాలు కేటాయింపు చేసినట్లు పేర్కొన్నారు. 1864 షాపులను ఓపెన్ కేటగిరీలో ఉంచడం జరిగిందని పేర్కొన్నారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 2620 మద్యం దుకాణాలలో గౌడలకు 15 శాతం (363), ఎస్ సి లకు 10 శాతం (262), ఎస్ టి కులస్తులకు రిజర్వేషన్ ప్రకారం కేటాయించినట్లు వెల్లడించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఆదేశాల మేరకు గౌడ, ఎస్సీ, ఎస్టీలు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించేందుకు దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ రాష్ట్రంలోనే మద్యం షాపుల రిజర్వేషన్లు కల్పించిన ఘనత తమదేనని తెలిపారు.
Minister Adimulapu Suresh : మంత్రి ఆదిమూలపు మీడియా సమావేశాన్ని అడ్డుకున్న విద్యార్ధి సంఘాలు
గతంలో నీరా పథకం తీసుకువచ్చి గౌడ్ లకు అవకాశం కల్పించినట్లు తెలిపారు. తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లాలలో మద్యం దుకాణాలను పైన తెలిపిన కమ్యూనిటీలకు లాటరీ ద్వారా కేటాయించామన్నారు. ఈ విడత షాపుల యజమానులకు వెసులుబాటు కల్పించామని పేర్కొన్నారు. ముఖ్యంగా గతంలో రెండు బ్యాంకు గ్యారంటీలు ఇవ్వాల్సివుండగా, ఇప్పుడు ఒక్కటే గ్యారంటీ తీసుకుంటున్నట్లు తెలిపారు.
దరఖాస్తు ఫీజు, లైసెన్స్ ఫీజు గత సంవత్సరం మాదిరిగానే అమలు చేస్తున్నామన్నారు. ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలతో పోలిస్తే మద్యం దుకాణాలు కూడా నామమాత్రంగా పెంచామని చెప్పారు. ప్రివిలన్స్ ఫీజు కూడా ఏడింతల నుండి పదింతలు చేశామని చొప్పుకొచ్చారు. లైసెన్స్ ఫీజు స్లాబులను 8 నుండి 12 కి పెంచామన్నారు. గతంలో ఒకరు ఒక్క షాపుకు మాత్రమే పాడుకునేందుకు పరిమితి ఉండేదని.., ఇప్పుడు ఆ పరిమితిని ఎత్తి వేశామన్నారు.
TDP : టీడీపీ నేతలపై కేసులు నమోదు
రాష్ట్రంలో గుడుంబాను ఉక్కుపాదాంతో అణచి వేశామన్నారు. అదేవిధంగా గంజాయిని కూడా అరికడతామని, అందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామని పేర్కొన్నారు. గంజాయి పండించడం, రవాణా చేసే వారిని గుర్తించి వారిపై పిడి యాక్టు కేసులు నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. కల్తీ మద్యాన్ని 100% నియంత్రిస్తామన్నారు.
- Loan App Harassment : తెలుగు రాష్ట్రాల్లో మళ్లీ పెరుగుతున్న లోన్‌యాప్ ఆగడాలు..బలైపోతున్న ప్రాణాలు
- Telangana : హెల్త్ హబ్ గా వరంగల్..పైసా ఖర్చు లేకుండా అందరికి కార్పొరేట్ వైద్యం : మంత్రి ఎర్రబెల్లి
- తెలుగు రాష్ట్రాలకు భారీగా పెట్టుబడులు
- Telangana : విద్యార్థిని కింద పడేసి కాళ్లతో తన్ని.. పిడుగుద్దులు గుప్పించిన డిప్యూటీ వార్డెన్
- తెలంగాణలో మొదలైన టెన్త్ ఎగ్జామ్స్
1Terrorist Attack: కాశ్మీర్లో కొనసాగుతున్న హింస: టీవీ నటిని కాల్చి చంపిన ఉగ్రవాదులు
2Crude oil from Russia: రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు కొనసాగించనున్న భారత్
3McDonald Customer: మెక్ డొనాల్డ్ కూల్ డ్రింక్‌లో చచ్చిన బల్లి: అవుట్లెట్ సీజ్
4VVS Laxman: టీమిండియా కోచ్‌గా వీవీఎస్ లక్ష్మణ్
5Ola S1 Pro: మరో వివాదంలో ఓలా స్కూటర్.. వినియోగదారుడి ట్వీట్
6CM KCR Karnataka tour: రేపు బెంగళూరుకు వెళ్లనున్న సీఎం కేసీఆర్
7TSRTC : హైదరాబాద్‌లో అర్ధరాత్రి పూట కూడా సిటీ బస్సు సర్వీసులు
8Konaseema : అమలాపురం అల్లర్ల కేసులో 46 మంది అరెస్ట్-తానేటి వనిత
9Adipurush: మరోసారి నిరాశపరిచిన ఆదిపురుష్
10Bypoll Schedule: ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల.. ఏపీలో అసెంబ్లీ స్థానానికి కూడా
-
Raviteja: మరో సినిమాకు రవితేజ పచ్చజెండా..?
-
BJP Supremacy: దేశ వ్యాప్తంగా ప్రజల్లోకి వెళ్లేందుకు బీజేపీ బ్లూ ప్రింట్ సిద్ధం: పార్టీ ఉన్నత స్థాయి సమావేశం
-
Dark Circles : ఇలా చేస్తే కంటి కింద నల్లటి వలయాలు తొలగిపోతాయ్!
-
Hair Whitening : జుట్టు తెల్లబడటానికి కారణాలు, నివారణకు సూచనలు
-
Modi in Hyderabad: ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటన పూర్తి వివరాలు
-
Basil : వేసవిలో ఆరోగ్యానికి మేలు చేసే తులసి!
-
Balakrishna: బాలయ్య కోసం హీరోయిన్ను ఫిక్స్ చేసిన అనిల్..?
-
Anemia : రక్తహీనతకు దారితీసే పోషకాహార లోపం!