Holi : మందుబాబులకు షాక్.. 48 గంటల పాటు మద్యం దుకాణాలు క్లోజ్

బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. సంబంధం లేని వ్యక్తులపై రంగులు వేయొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు

Holi : మందుబాబులకు షాక్.. 48 గంటల పాటు మద్యం దుకాణాలు క్లోజ్

Holi

Updated On : March 17, 2022 / 6:48 AM IST

Liquor Shops Closed : హోలీ పండుగ వచ్చేస్తోంది. ఈ సందర్భంగా తెలంగాణ పోలీసులు ఆంక్షలు విధించారు. హైదరాబాద్ నగర పీఎస్ పరిధిలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా ఉండేందుకు ముందస్తు జాగ్రత్తలు చేపట్టారు. జంట నగరాల పరిధిలో 48 గంటల పాటు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. హోలీ సందర్భంగా 2022, మార్చి 19వ తేదీ ఉదయం 06 గంటల వరకు మద్యం దుకాణాలు, బార్లు, క్లబ్ లు మూసివేయాల్సిందిగా అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Read More : Fuel Prices Hike : రేపో మాపో పెరగనున్న పెట్రోల్ ధర? లీటర్ పై రూ.12 పెంపు?

బహిరంగ ప్రదేశాల్లో హోలీ వేడుకలపై నిషేధం విధించారు. సంబంధం లేని వ్యక్తులపై రంగులు వేయొద్దని స్పష్టం చేశారు. నిబంధనలు అతిక్రమిస్తే.. కఠిన చర్యలుంటాయని పోలీసులు హెచ్చరికలు జారీ చేశారు. హోలీ వేడుకల్లో పాల్గొనే వారు.. ఇతరులకు ఇబ్బందులు కలిగించవద్దని, గుంపులు గుంపులు తిరుగుతూ.. న్యూసెన్స్ చేయవద్దని సూచించారు. మూడు పోలీస్ కమిషనరేట్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని వెల్లడించారు. గురువారం సాయంత్రం 06 గంటల నుంచి శనివారం ఉదయం 06 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని పోలీసులు వెల్లడించారు. రెండు రోజుల పాటు మద్యం దుకాణాలు బంద్ అవుతుండడంతో మద్యం ప్రియులు వైన్స్ షాపుల వద్ద పెద్ద సంఖ్యలో బారులు తీరారు. దీంతో వైన్స్ షాపులు కిటకిటలాడుతున్నాయి.