LKG – Jiivi : ‘ఆహా’ లో పక్కా పాప్‌కార్న్ మూవీస్.. ‘ఎల్‌.కె.జి’ – ‘జీవి’..

జూన్ 25న ‘ఎల్‌.కె.జి’, ‘జీవి’ చిత్రాలు వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్స్‌గా ‘ఆహా’లో విడుద‌ల కానున్నాయి..

LKG – Jiivi : ‘ఆహా’ లో పక్కా పాప్‌కార్న్ మూవీస్.. ‘ఎల్‌.కె.జి’ – ‘జీవి’..

Lkg Jiivi

LKG – GV: తెలుగు ప్రేక్ష‌కుల‌కు అప‌రిమిత‌మైన, అత్యుత్త‌మ వినోదాన్ని అందిస్తామ‌ని మాట ఇచ్చిన తెలుగు ఓటీటీ మాధ్య‌మం ‘ఆహా’.. చెప్పిన‌ట్లుగానే మాట‌ల‌ను నిల‌బెట్టుకుంటోంది. లేటెస్ట్ బ్లాక్‌బ‌స్ట‌ర్స్, ఒరిజిన‌ల్స్‌తో ప్రేక్ష‌కుల ఆనందాన్ని రెట్టింపు చేస్తోంది ‘ఆహా’. ఈ క్ర‌మంలో జూన్ 25న ‘ఎల్‌.కె.జి’, ‘జీవి’ చిత్రాలు వ‌ర‌ల్డ్ ప్రీమియ‌ర్స్‌గా ‘ఆహా’లో విడుద‌ల కానున్నాయి. ఇందులో ‘జీవి’ ఎగ్జ‌ైయిట్‌మెంట్‌ను క్రియేట్ చేసే యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ కాగా.. నేటి రాజ‌కీయ నాయ‌కుల గురించి తెలియ‌జేసే పొలిటిక‌ల్ కామెడీ మూవీ ‘ఎల్‌.కె.జి’.

‘జీవి’ సినిమా విష‌యానికి వ‌స్తే ఇందులో వెట్రి, క‌రుణాక‌ర‌న్‌, రోహిణి కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. అల్ల‌రి చిల్ల‌ర‌గా తిరిగే ఓ యువ‌కుడి క‌థే ఇది. రొమాన్స్‌లో ఫెయిలైన ఈ యువ‌కుడు త‌న ఇంటి ఓన‌ర్ ఇంట్లోనే దొంగ‌త‌నం చేయాల‌ని నిర్ణ‌యించుకుంటాడు. అప్పుడేం జ‌రుగుతుంద‌నే క‌థ‌. 2019లో విడుద‌లైన ఈ త‌మిళ స్లిక్ థ్రిల్ల‌ర్ ‘జీవి’ని వి.జె.గోపీనాథ్ తెర‌కెక్కించారు. అద్భుత‌మైన క‌థ‌, స్క్రీన్‌ప్లేతో రూపొందిన చిత్రంగా విడుద‌ల త‌ర్వాత ప్రేక్ష‌కుల‌, విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌ను ‘జీవి’ అందుకుంది.

‘ఎల్‌.కె.జి’ విష‌యానికి వ‌స్తే ప్ర‌భు ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన పొలిటిక‌ల్ సెటైరిక‌ల్ మూవీ ఇది. ఆర్‌.జె.బాలాజీ, ప్రియా ఆనంద్, జె.కె.రితేశ్ ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు. ఇందులో లీడ్ రోల్ పోషించిన ఆర్‌.జె.బాలాజీ స‌హ ర‌చ‌యిత‌గానూ వ్య‌వ‌హ‌రించ‌డం విశేషం. రాజ‌కీయంలో ప్రాచుర్యం పొందిన ప‌ద్ధ‌తుల‌కు ఈ చిత్రం అద్దం ప‌ట్టింది. రెడ్ టాపిజం, అవినీతి వ్య‌వ‌స్థ వంటి విష‌యాల‌ను స‌ర‌దాగా, సునిశితంగా ఈ చిత్రంలో తెర‌కెక్కించారు. ఓ చిన్న ప‌ట్ట‌ణంలో కౌన్సిల‌ర్ అయిన ‘ఎల్‌.కె.జి’ అనే వ్య‌క్తి రాష్ట్రానికి ముఖ్య‌మంత్రి కావాల‌నుకునే క‌థే ఇది. ప్రేక్ష‌కుల‌ను ఆలోచింప‌చేసే కోణంలో ‘ఎల్.కె.జి’ సినిమాను రూపొందించారు.

‘ఎల్‌.కె.జి’, ‘జీవి’ చిత్రాలు వేర్వేరు జోన‌ర్స్‌కు చెందిన‌వి. సినీ వినోదం కోసం త‌ప‌న ప‌డే ప్రేక్ష‌కులను సంతృప్తి ప‌రిచే ప‌క్కా పాప్‌కార్న్ చిత్రాలివి. అంతే కాదండోయ్ ‘ఆహా’లో అద్భుతైన షోస్ ఎన్నో ప్రేక్ష‌కుల‌ను మెప్పించ‌డానికి సిద్ధంగా ఉన్నాయి. ‘క్రాక్‌, నాంది, జాంబిరెడ్డి, లెవ‌న్త్ అవ‌ర్‌, చావు క‌బురు చ‌ల్ల‌గా, ఇన్ ది నేమ్ ఆఫ్ గాడ్‌, కాలా’ ఈ వ‌రుస‌లో కొన్ని. ప్రేక్ష‌కుల వారాంతాల‌ను మ‌రింత స‌జీవంగా, మెరుగ్గా చేయ‌డానికి తిరుగులేని ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను అందిస్తోంది తెలుగు ఓటీటీ మాధ్యమం ‘ఆహా’.