MAA Elections 2021 ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం బాధగా ఉంది

చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చాలా ఉత్కంఠగా జరిగాయి. అటు చిత్ర పరిశ్రమలోనూ, ఇటు ప్రజల్లోనూ ఎంతో ఆసక్తిని కలిగించాయి. ప్రకాష్ రాజ్,

MAA Elections 2021 ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం బాధగా ఉంది

Maa Elections 2021 Srikanth

MAA Elections 2021 : చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఈసారి టాలీవుడ్ మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికలు చాలా ఉత్కంఠగా జరిగాయి. అటు చిత్ర పరిశ్రమలోనూ, ఇటు ప్రజల్లోనూ ఎంతో ఆసక్తిని కలిగించాయి. ప్రకాష్ రాజ్, మంచు విష్ణు ప్యానెళ్లు గెలుపు కోసం తీవ్రంగా పోటీపడ్డాయి. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకున్నారు. మాటల యుద్ధం జరిగింది. పోలింగ్ సందర్భంగా ఇరు ప్యానెళ్ల సభ్యుల మధ్య వాగ్వాదం చోటు చేసుకోవడం ఉద్రిక్తతలకు దారితీసింది. చివరికి ఫలితాలు వచ్చాయి. మా అధ్యక్షుడిగా మంచు విష్ణు ప్రకాష్ రాజ్ పై భారీ మెజార్టీతో గెలిచారు.

‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం పట్ల నటుడు శ్రీకాంత్ స్పందించారు. ప్రకాశ్ రాజ్ ప్యానెల్ తరఫున మా ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ గా పోటీ చేసిన శ్రీకాంత్ తన ప్రత్యర్థి బాబూ మోహన్ పై నెగ్గారు. తనను నమ్మారు కాబట్టే ఓటు వేసి గెలిపించారని అన్నారు. అయితే తాను గెలిచినప్పటికీ ప్రకాశ్ రాజ్ ఓడిపోవడం బాధ కలిగిస్తోందన్నారు.

MAA Elections 2021 : ప్రకాశ్ రాజ్ ఓటమి.. చిరంజీవి షాకింగ్ కామెంట్స్

‘మా’ కోసం ఎంతో చేయాలని మేము ప్రణాళికలు రూపొందించుకున్నాం. గత రెండు నెలలుగా కలిసి ప్రయాణించాం. మా బృందం మా పీఠం ఎక్కలేకపోవడం కొంచెం నిరాశ కలిగించే విషయమే. ఇది కూడా ఓ సినిమా అనుకుని వెళ్లిపోవడమే” అని శ్రీకాంత్ అన్నారు. ఇక మా నూతన అధ్యక్షుడు మంచు విష్ణుకు అభినందనలు తెలిపారు శ్రీకాంత్.

మా అధ్యక్షుడిగా గెలిచినట్లు అధికారిక ప్రకటన వెలువడిన వెంటనే మంచు విష్ణు కన్నీళ్లు పెట్టుకున్నారు. భావోద్వేగానికి గురై చాలాసేపు ఏమీ మాట్లాడలేకపోయారు. పక్కనే ఉన్న తన ప్రత్యర్ధి ప్రకాశ్‌రాజ్‌ను విష్ణు ఆలింగనం చేసుకున్నారు. అనంతరం మాట్లాడిన విష్ణు ఎన్నికల్లో విజయం తన తండ్రిదేనని చెప్పారు. ఎన్నికల విషయంలో ఇంత దూరం వచ్చి ఉండకూడదని అన్నారు. ఇలాంటి వాతావరణం మా.. లో లేకుండా చూస్తానని చెప్పారు.
గతంలోనే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయాల్సిన విష్ణుని తన తండ్రి, నటుడు మోహన్‌బాబు వద్దన్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా పోటీ చేయమని సూచించారు. అలా తొలి ప్రయత్నంలోనే ‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు విష్ణు.

MAA Elections: మంచు విష్ణు కంటతడి.. ఫలితాల అధికారిక ప్రకటన సమయంలో కన్నీళ్లు!

కాగా, మా ఎన్నికల ఫలితాలతో.. మెగా బ్రదర్ నాగబాబు షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు. మా.. సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఫలితాలు వెలువడిన కాసేపటికే ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. రాజీనామా విషయాన్ని ట్విటర్ ద్వారా తెలియజేశారు. ‘ప్రాంతీయవాదం, సంకుచిత మనస్తత్వంతో కొట్టుమిట్టాడుతున్న MAA లో కొనసాగడం ఇష్టం లేక.. మా.. అసోసియేషన్ లో నా ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నాను. సెలవు. ఇది ఎంతో చిత్తశుద్దితో ఆలోచించి తీసుకున్న నిర్ణయం” అని నాగబాబు ట్వీట్ చేశారు.

కాగా, మా.. ఎన్నికల సమయంలో ప్రకాష్ రాజ్ ప్యానల్ కు మద్దతిచ్చిన నాగబాబు.. ప్రకాష్ రాజ్ తరఫున.. కాస్త గట్టిగానే మాట్లాడారు. విష్ణు టార్గెట్ గా హాట్ కామెంట్లు చేశారు. మెగా కుటుంబం మద్దతు.. ప్రకాష్ రాజ్ కే అని తేల్చి చెప్పారు. చివరికి.. మంచు విష్ణు విజయం సాధించిన పరిస్థితుల్లో.. నాగబాబు ఈ షాకింగ్ డెసిషన్ తీసుకున్నారు.