లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ
LIVE TV
LIVE TV
× లేటెస్ట్తెలంగాణఆంధ్రప్రదేశ్క్రైమ్జాతీయంఅంతర్జాతీయంసినిమా & OTTలైఫ్ స్టైల్టెక్నాలజీ

National

ఒంటికాలితోనే 43 రోజుల్లో 3,800 కిలోమీటర్ల సైకిల్‌ యాత్ర..దేశంలోనే ఏకైక ఫిమేల్‌ పారా సైక్లిస్ట్‌గా తాన్యదగా రికార్డ్

Updated On - 3:55 pm, Fri, 22 January 21

Madhya pradesh tanya dhag cycled 3800 kilometers 43 days : ఆత్మవిశ్వాసం ఉంటే అంగవైకల్యం అడ్డురాదని నిరూపించిందో యువతి. ప్రమాదంలో కాలు పోగొట్టుకున్నా..సాహసాలు చేసేందుకు నేను రెడీ అంది. ఒంటికాలితోనే కశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకూ సైకిల్ యాత్ర పూర్తిచేసి దేశంలోనే ఏకైక ఫిమేల్‌ పారా సైక్లిస్ట్‌గా తాన్య గుర్తింపు తెచ్చుకుంది. ఒంటికాలితోనే సైకిల్ పై ఏకంగా 43 రోజుల్లో 3,800 కిలోమీటర్లు యాత్రను విజయవంతంగా పూర్తి చేసి రికార్డు సృష్టించింది. ఔరా..ఏమి ఈ సాహసం అనిపించింది మధ్యప్రదేశ్‌కు చెందిన సాహస నారి తాన్య దగా..! యాత్రలోనే తండ్రి మరణవార్త కృంగదీసినా మొక్కవోని దీక్షతో తన యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది తాన్య.


బీఎస్‌ఎఫ్‌ సహకారంతో నడిచే ఆదిత్యా మెహతా ఫౌండేషన్‌.. దేశవ్యాప్తంగా శారీరకంగా వికలాంగులైన విద్యార్థులకు పారా స్పోర్ట్స్‌పై అవగాహన కల్పిస్తూ..విరాళాలు సేకరిస్తోంది. దీంట్లో భాగంగా ప్రతీ సంవత్సరం ‘ఇన్ఫినిటీ రైడ్‌’ను నిర్వహిస్తోంది. ఈ ‘ఇన్ఫినిటీ రైడ్‌ కె2కే– 2020’లో తొమ్మిది సభ్యుల బృందంలో ఏకైక ఫిమేల్‌ పారసైక్లిస్ట్‌గా పాల్గొంది తాన్య. 43 రోజుల్లో 3,800 కిలోమీటర్లు (కశ్మీర్‌ టు కన్యాకుమారి) సైకిల్‌ యాత్ర పూర్తి చేసింది. 3,800 కిలోమీటర్లు ప్రయాణించి దేశంలోనే ఏకైక ఫిమేల్‌ పారా సైక్లిస్ట్‌గా తాన్య గుర్తింపు తెచ్చుకుంది తాన్య దగా.

రెండు కాళ్లతో లేడి పిల్లలా గెంతులేసి తాన్యకు 2018 సంవత్సరంలో డెహ్రాడూన్‌ లో జరిగిన కారు ప్రమాదం వైకల్యాన్ని మిగిల్చింది. ఎంబీఏ చదువుతున్న సమయంలో కారు ప్రమాదంలో తాన్య కుడికాలిని కోల్పోంది. ఆ ప్రమాదంతో 6 నెలలు మంచానికే పరిమితమైపోయింది. సొంతంగా కదల్లేదు..ఏపనీ చేసుకోలేకపోయింది. ఇక నా జీవితం అయిపోయింది. ఇక నా బ్రతుకు ఇంతేనుకుని కృంగిపోయింది.

కానీ తండ్రి ఎంతో ధైర్యం చెప్పేవారు. కూతురిలో ధైర్యాన్ని నూరిపోసావారు. ఈ ప్రమాదంలో నువ్వు కోల్పోయింది కేవలం నీ కాలు మాత్రమే..శరీరంలో ఓ భాగం కోల్పోయినంత మాత్రాన జీవితం అక్కడితో ఆగిపోదని..లక్ష్యం కోసం శ్రమించాలని నిరంతరం ధైర్యం చెప్పేవారు. తండ్రి మాటలు తాన్యలో కొత్త ఉత్సాహాన్ని నింపేవి. కొత్త జీవితంపై ఆశలు చిగురించేలా తండ్రి చెప్పే మాటలపై నమ్మకం పెంచుకుంది తాన్య. అలా ఆరు నెలల తర్వాత శారీరకంగాను మానసికంగా దృఢంగా తయారైంది. అలా పారాస్పోర్ట్స్‌ను ప్రోత్సహించే ఫౌండేషన్‌ లో చేరిన తాన్య అక్కడ చాలా నేర్చుకుంది.

ఈ క్రమంలోనే 2020 నవంబర్‌ 19న కశ్మీర్‌ టు కన్యాకుమారి యాత్రకు మా టీమ్‌తో తాన్యదగా కూడా బయలు దేరింది. అంతా సాఫీగా సాగుతున్న సమయంలో విధి మరోసారి తాన్యను సవాలు చేసింది. యాత్రలో భాగంగా..తాన్య డిసెంబర్‌ 18న హైదరాబాద్‌లో ఉండగా.. తనకు ఎంతో ధైర్యం ఇచ్చి తిరిగి కొత్త జీవితాన్నిచ్చిన తండ్రి చనిపోయాడనే వార్త వినాల్సి వచ్చింది. ఆ వార్తతో తాన్య చాలా కృంగిపోయింది.

నా తండ్రి ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఇంత వరకూ వచ్చాను..కానీ తండ్రే నా నుంచి దూరం అయిపోడే అని ఎంతగానో ఏడ్చంది. గుండెలు పగిలేలా ఏడ్చింది. ఒక్కసారిగా జీవితం మరోసారి అంధకారమైనట్లు అనిపించింది. ఆ బాధతోనే మధ్యప్రదేశ్‌ వెళ్లి నాన్నను కడసారి చూసి వచ్చి.. తిరిగి యాత్రా బృందంతో కలిసి యాత్ర కొనసాగించింది. యాత్రను విజయవంతంగా పూర్తి చేసింది.

ఈ సందర్భంగా తాన్యాదగా మాట్లాడుతూ..నన్ను ఎంతగానో ప్రోత్సహించి, కుంగిపోకుండా కొత్త జీవితాన్నిచ్చిన నా తండ్రి చివరి కోరిక ఈ యాత్రను పూర్తి చేయడం. అందుకే అంత బాధలోనూ నాన్న స్ఫూర్తితో లక్ష్యాన్ని పూర్తి చేసి నాన్న కోరికను తీర్చానని తాన్య సగర్వంగా చెప్పింది’’.