Maharashtra Deputy CM : అజిత్​ పవార్​కు ఐటీ షాక్..రూ.1000కోట్ల ఆస్తులు సీజ్

పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​కు ఐటీ షాక్ తగిలింది. అజిత్ పవార్​కు చెందిన రూ. 1000 కోట్లు విలువ చేసే ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ మంగళవారం సీజ్

Maharashtra Deputy CM : అజిత్​ పవార్​కు ఐటీ షాక్..రూ.1000కోట్ల ఆస్తులు సీజ్

Maha

Maharashtra Deputy CM  పన్ను ఎగవేత కేసుకు సంబంధించి మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి అజిత్​ పవార్​కు ఐటీ షాక్ తగిలింది. అజిత్ పవార్​కు చెందిన రూ. 1000 కోట్లు విలువ చేసే ఆస్తులను ఆదాయపు పన్నుశాఖ మంగళవారం సీజ్​ చేసింది.

ముంబైలోని నారిమన్ పాయింట్ లోని నిర్మల్ టవర్,ఓ షుగర్ ఫ్యాక్టరీ మరియు ఓ రిసార్ట్ సహా ఐదు ప్రాపర్టీలను ఐటీ శాఖ సీజ్ చేసింది. బినామీ నిరోధక చట్టాన్ని ప్రయోగించి ప్రాపర్టీలను సీజ్ చేసిన ఐటీ శాఖ..అజిత్ పవార్ మరియు అతని కుటుంబం ఈ బినామీ ఆస్తుల లబ్ధిదారులు అని పేర్కొంది. ఈ ఆస్తుల ప్ర‌స్తుత మార్కెట్ విలువ రూ 1000 కోట్ల‌కు పైగా ఉంటుంది. ఈ ఆస్తులు ఏవీ అజిత్ ప‌వార్ పేరుతో లేక‌పోవ‌డం గ‌మ‌నార్హం.

కాగా, పన్ను ఎగవేత ఆరోపణలపై ఇటీవల అజిత్​ పవార్​ బంధువుల నివాసాలు, కార్యాలయాలపై ఆదాయ పన్ను శాఖ దాడులు జరిపింది. ముంబై, పుణె, సతారా సహా మహారాష్ట్ర, గోవాలోని మరికొన్ని నగరాల్లో ఐటీ దాడులు జరిగాయి. డీబీ రియాల్టీ, శివాలిక్, జరండేశ్వర్ సాఖర్ షుగర్ కార్ఖానా (జరండేశ్వర్ ఎస్​ఎస్​కే), పవార్​ సోదరీమణుల వ్యాపార సముదాయాల్లో ఈ సోదాలు జరిగాయి. గ‌త వారం అజిత్ ప‌వార్ బంధువుల‌కు చెందిన‌విగా భావిస్తున్న రెండు రియ‌ల్ ఎస్టేట్ వ్యాపార సంస్ధ‌ల‌పై ఐటీ అధికారులు చేప‌ట్టిన దాడుల్లో రూ 184 కోట్ల లెక్క‌తేల‌ని ఆదాయాన్ని గుర్తించారు.

ALSO READ Huzurabad by election : కారును వెనక్కి నెట్టేసి..10వ రౌండ్ లోను బీజేపీ ముందంజ