I Don’t want To beg : నేను బిచ్చమెత్తుకోవట్లేదు..రూ.10 పెట్టి పెన్ను కొనండి చాలు: ఇట్లు బోసినవ్వుల బామ్మ

‘నేను బిచ్చమెత్తుకోవట్లేదు..రూ.10 పెట్టి పెన్ను కొనండి చాలు’ అంటూ ఆత్మాభిమానానికి మారుపేరుగా నిలుస్తు ఎంతోమందిని ఆకట్టుకుంటోందో బామ్మ.

I Don’t want To beg : నేను బిచ్చమెత్తుకోవట్లేదు..రూ.10 పెట్టి పెన్ను కొనండి చాలు: ఇట్లు బోసినవ్వుల బామ్మ

I Don’t Want To Beg Please Buy Rs.10 (1)

I Don’t want To beg please buy Rs.10 : ఆత్మాభిమానం ఉన్న ఓ బోసినవ్వుల బామ్మగారి గురించి తెలిస్తే ఎవ్వరైనా హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే. ఆమె కథ అటువంటిది. కాళ్లూ చేతులు బాగానే ఉన్నా..చాలామంది బిచ్చమెత్తుకుంటుంటారు. దానికి అలవాటు పడిపోయి ఏ గుడిమెట్లమీదనో..బస్టాపుల్లోను..సిగ్నల్స్ వద్దు అడుక్కుంటూ బతికేస్తుంటారు. కానీ ఓ బామ్మ మాత్రం అలా కాదు ..‘నేను బిచ్చగత్తెను కాదు..రూ.10 పెట్టి పెన్ను కొనండి చాలు’ అంటోంది. పండు ముస‌లి వ‌య‌సులోనూ పెన్నులు అమ్ముకుంటూ జీవ‌నం సాగిస్తోంది.

Read more : Colette Maze : 107 ఏళ్ల వయస్సులో పియానో ఆల్బమ్ రిలీజ్ చేసిన బామ్మ

ఆ బామ్మ పేరు ర‌త‌న్..పుణెలోని ఎంజీ రోడ్డులో పెన్నులు అమ్ముకుంటు జీవిస్తోంది. తాను పెన్నులు అమ్ముకునే డ‌బ్బాపై రాసిన రాతలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అంతేకాదు ఎంతోమందిని ఆలోచింపజేస్తున్నాయి. ఆ డబ్బాపై ‘నేను భిక్షం అడుక్కోవట్లేదు..ద‌య‌చేసి రూ.10లు పెట్టి పెన్ను కొనండి. బ్లూ క‌ల‌ర్ పెన్స్, థ్యాంక్యూ. బ్లెస్ యూ’ అని రాసి ఉంది. పెన్నులు అమ్ముకుంటూ ప‌లువురిని ఆక‌ర్షిస్తోంది. పెన్నులు కొన్న త‌ర్వాత వారిని మనస్ఫూర్తిగా చిరున‌వ్వు దీవిస్తుంది. అలా ఆ బోసినవ్వుల బామ్మను కథ తెలుసుకున్న శిఖా రాతి అనే యువతి ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయటంతో వైరల్ గా మారింది. అలా నెటిజన్లు హృద‌యాలను దోచుకుంటోంది రతన్ బామ్మ. రతన్ బామ్మ స్టోరీని శిఖా రాతి త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. ప్ర‌స్తుతం ర‌త‌న్ స్టోరీ నెట్టింట వైర‌ల్‌గా మారింది.

Read more : Bibiji Juice : 80 ఏళ్ల బామ్మ జ్యూస్‌ స్టాల్..ఆమె ఆత్మవిశ్వానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే

శిఖా రాతి త‌న ఫ్రెండ్‌తో క‌లిసి రోడ్డుపై న‌డుచుకుంటూ వెళ్తుతోంది. అప్పుడు ర‌త‌న్ బామ్మ త‌న పెన్నులు అమ్ముకుంటు క‌నిపించింది. ఆ డ‌బ్బాపై రాసి ఉన్న ఆ వ్యాఖ్య‌లు చదివిన శిఖాకు ఆమె ఫ్రెండ్ కు బామ్మగారిపై చాలా ఇంట్రెస్ట్ కలిగింది. వెంటనే ఇద్దరు పెన్నులు కొన్నారు. దాంతో ర‌త‌న్ క‌ళ్ల‌ల్లో సంతోషం క‌నిపించింది. ఆమె ముఖంలో చిరున‌వ్వు క‌నిపించింది.

ర‌త‌న్ మంచి మ‌న‌సు..ఆమె ఆత్మాభిమానం వారికి నచ్చాయి. రతన్ బామ్మగారి స్వీట్ స్మైల్ శిఖా ఫ్రెండ్‌ను బాగా ఆక‌ర్షించింది. ఆమె వద్ద మ‌రిన్ని పెన్నులు కొని ర‌త‌న్‌ను సంతోష‌పెట్టింది. బ‌తుకు దెరువు కోసం ర‌త‌న్ ప‌డుతున్న క‌ష్టాల‌ను గుర్తించి.. ఆమె వ‌ద్ద పెన్నుల‌ను కొనుగోలు చేయాల‌ని శిఖా పుణె వాసుల‌ను కోరింది.

Read more : 94 ఏళ్ల బామ్మ..ఆమే పేరే బ్రాండ్..స్టార్టప్ తో లక్షలు సంపాదన