Maharashtra: ‘మహా’ అసెంబ్లీలో నేడే బల పరీక్ష

మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత బలపరీక్ష ఉంటుంది. ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలి.

Maharashtra: ‘మహా’ అసెంబ్లీలో నేడే బల పరీక్ష

Maharashtra

Maharashtra: మహారాష్ట్ర అసెంబ్లీలో నేటి నుంచి రెండు రోజులపాటు ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల సందర్భంగా ఆదివారం స్పీకర్ ఎన్నిక జరుగుతుంది. స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత బలపరీక్ష ఉంటుంది. ముఖ్యమంత్రిగా ఎన్నికైన ఏక్‌నాథ్ షిండే అసెంబ్లీలో తన బలాన్ని నిరూపించుకోవాలి. మరోవైపు స్పీకర్ పదవి కోసం బీజేపీ-శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేల తరఫున బీజేపీ ఎమ్మెల్యే రాహుల్ నవ్రేకర్ పోటీ చేస్తుండగా, శివసేన-కాంగ్రెస్-ఎన్సీపీల కూటమి అయిన మహా వికాస్ అఘాడి (ఎమ్‌వీఏ) తరఫున రాజన్ సాల్వి పోటీ చేస్తున్నారు.

Metro Trains : నేడు సాధారణంగానే మెట్రో రైళ్లు నడుస్తాయి : ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి

ఈ ఎన్నిక కోసం ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్‌గా ఉన్న నర్హరి జిర్వాల్ స్పీకర్‌గా వ్యవహరిస్తారు. ఆయన ఆధ్వర్యంలోనే ఓటింగ్ నిర్వహించి, నూతన స్పీకర్‌ను ఎన్నుకుంటారు. కొత్త స్పీకర్ ఎన్నిక పూర్తైన తర్వాత, అసెంబ్లీలో బల పరీక్ష జరిగే అవకాశం ఉంది. ఈ విశ్వాస పరీక్షలో పాల్గొనేందుకు గోవాలో ఉన్న తిరుగుబాటు ఎమ్మెల్యేలు శనివారం రాత్రి ముంబై చేరుకున్నారు. మొత్తం శివసేన తరఫున ఎన్నికైన ఎమ్మెల్యేలు 55 మంది కాగా, అందులో 38 మంది షిండేకు మద్దతుగా ఉన్నారు. అలాగే బీజేపీ తరఫున 105 మంది ఎమ్మెల్యేలు, 9 మంది స్వతంత్ర్య ఎమ్మెల్యేలు, ఇద్దరు వేరే పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు కూడా షిండేకు మద్దతుగా ఓటు వేయబోతున్నారు. ఈ లెక్కన చూస్తే 288 మంది సభ్యులున్న అసెంబ్లీలో షిండే సులభంగానే మెజారిటీ సాధించే అవకాశం ఉంది.

Punjab Man: డ్రగ్స్ తీసుకోకుండా అడ్డుకోవడానికి కొడుకును చైన్‌లతో కట్టేసిన తల్లి

ఈ రోజు విశ్వాస పరీక్షలో షిండే నెగ్గితే, మహారాష్ట్రలో 31 నెలల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరినట్లవుతుంది. అయితే, శివసేన తిరుగుబాటు ఎమ్మెల్యేలకు ఆ పార్టీ నాయకత్వం విప్ జారీ చేసింది. కానీ, మెజారిటీ తమ వైపే ఉండటంతో ఆ విప్ తమకు వర్తించదని తిరుగుబాటు ఎమ్మెల్యేలు అంటున్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేల్లో 15 మందిపై సస్పెన్షన్ వేటు పడిన సంగతి తెలిసిందే. దీనిపై ఈ నెల 11న సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది.