Maharashtra : పాత సామాన్లతో ఫోర్ వీలర్..సామాన్యుడిని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్ర

ఈ వాహనం చేయడానికి రూ. 60 వేలు అప్పు కూడా చేశాడు. పేద కుటుంబం అయినా..తన కొడుకు కోసం దీనిని తయారు చేశాడు. దీనిని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదిగాక పోస్టు చేశారు.

Maharashtra : పాత సామాన్లతో ఫోర్ వీలర్..సామాన్యుడిని మెచ్చుకున్న ఆనంద్ మహీంద్ర

Mahindra

Impressed Anand Mahindra : బిజినెస్ మెన్ ఆనంద్ మహీంద్ర వ్యాపారంతో పాటు..సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటారు. ఆసక్తికరమైన, ఆలోచింప చేసే పోస్టులు చేస్తుంటారాయన. ఇతరుల టాలెంట్ ను ప్రోత్సాహించే విధంగా చేస్తుంటారు. తాజాగా…ఓ సామాన్యుడి టాలెంట్ ను మెచ్చుకున్నారు. ఈ మేరకు ట్విట్టర్ వేదికగా ట్వీట్ చేశారు.

Read More : Bijbehara Militant Attack : ఉగ్రవాదుల కాల్పుల్లో ASI మృతి

ఇతను ఎవరు ? ఏం చేశాడు ?

యూ ట్యూబ్ చానల్ Historicano ప్రకారం…మహారాష్ట్రలోని దేవ్ రాప్ ట్రే గ్రామంలో దత్తాత్రేయ లొహర్ కుటుంబంతో నివాసం ఉంటున్నాడు. పాత, పాడుబడిన కార్ల నుంచి పార్ట్ లను సేకరించాడు. తర్వాత…దానికి ఒకరూపు తీసుకొచ్చాడు. తనలో ఉన్న టాలెంట్ ను ఉపయోగించి..చిన్నసైజులాంటి ఫోర్ వీలర్ ను తయారు చేశాడు. ఈ వాహనం చేయడానికి రూ. 60 వేలు అప్పు కూడా చేశాడు. పేద కుటుంబం అయినా..తన కొడుకు కోసం దీనిని తయారు చేశాడు. దీనిని ఆనంద్ మహీంద్ర ట్విట్టర్ వేదిగాక పోస్టు చేశారు. ఎలాంటి నిబంధనలకు అనుగుణంగా లేకపోయినా…తక్కువ వనరులతో ఎక్కువ ఫలితాలన్ని చూపెట్టే ప్రజల చాతుర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేని అంటూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ క్షణాల్లో వైరల్ అయ్యింది. ఆ ట్వీట్ ను రీ ట్వీట్ చేశారు.