RRR: ఆర్ఆర్ఆర్‌పై మహేష్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

రికార్డులను తిరగరాస్తూ తనదైన సత్తా చాటుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మున్ముందు ఎలాంటి రికార్డులను క్రియేట్....

RRR: ఆర్ఆర్ఆర్‌పై మహేష్ కామెంట్స్.. ఏమన్నాడంటే?

Mahesh Babu Tweets On Rrr Movie

Updated On : March 26, 2022 / 4:06 PM IST

RRR: రికార్డులను తిరగరాస్తూ తనదైన సత్తా చాటుతున్న ప్రెస్టీజియస్ మూవీ ‘ఆర్ఆర్ఆర్’ మున్ముందు ఎలాంటి రికార్డులను క్రియేట్ చేస్తుందా అని లెక్కలు వేసే పనిలో ఉన్నారు సినీ ఎక్స్‌పర్ట్స్. ఇక ఈ సినిమాను చూసిన వారు తమ సంతోషాన్ని వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో దుమ్ములేపుతుంటే, చూడని వారు ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

RRR: జక్కన్న కాకుంటే.. తారక్-చరణ్ ఫ్యాన్స్ పరిస్థితి ఎలా ఉండేదో?

కాగా ఆర్ఆర్ఆర్ చిత్ర మేనియాలో సెలబ్రిటీలు కూడా వరుసగా ఈ సినిమాను చూస్తూ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తూ సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్నారు. తాజాగా ఈ సినిమాను చూసిన టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సోషల్ మీడియాలో ఆర్ఆర్ఆర్‌పై ప్రశంసల వర్షం కురిపించాడు. RRR ఒక ఎపిక్ అని ఆయన పేర్కొన్నారు. ఈ సినిమాలోని గ్రాండియర్ విజువల్స్, మ్యూజిక్, ఎమోషన్స్‌ను ఎవరూ ఊహించని విధంగా ఉన్నాయని.. సంప్లీ స్టన్నింగ్‌గా ఉన్నాయని మహేష్ అన్నారు.

RRR Collections : అమెరికా, ఆస్ట్రేలియాలో కలెక్షన్ల సునామి.. విదేశాల్లో ‘ఆర్ఆర్ఆర్’ హవా..

అటు తరాక్, చరణ్‌లు నటనతో తమ స్టార్‌డమ్‌ను కూడా మించిపోయారని.. నాటు నాటు సాంగ్‌లో వారిని చూస్తుంటే.. వాళ్లు గాల్లోకి ఎగురుతున్నట్లు కనిపించారు. ఇలాంటి ప్రెస్టీజియస్ మూవీని అందించిన ఆర్ఆర్ఆర్ చిత్ర టీమ్‌కు మహేష్ హ్యాట్సాఫ్ తెలిపారు. తెలుగు సినిమా స్థాయిని మరో లెవెల్‌కు తీసుకెళ్లింది ఆర్ఆర్ఆర్ టీమ్ అని ఆయన పేర్కొన్నారు.