Mamata Eid Prayer : భారత్‌లో ప్రస్తుత పరిస్థితి ఏం బాగోలేదు : మమతా బెనర్జీ

Mamata Eid Prayer : రంజాన్ పర్వదినాన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్‌కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్‌లో జరిగిన ఈద్ ప్రార్థనల్లో మమతా పాల్గొన్నారు.

Mamata Eid Prayer : భారత్‌లో ప్రస్తుత పరిస్థితి ఏం బాగోలేదు : మమతా బెనర్జీ

Mamata Attends Eid Prayer Meet, Says Politics Of Isolation Going On In India Not Welcome

Mamata Eid Prayer : రంజాన్ పర్వదినాన పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఈద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు. కోల్‌కతాలోని రైన్ డ్రెంచ్డ్ రెడ్ రోడ్‌లో జరిగిన ఈద్ ప్రార్థనల్లో మమతా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మతా మాట్లాడుతూ.. బీజేపీ సర్కారుపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. దేశంలో ప్రస్తుతం పరిస్థితి అసలే బాగోలేదన్నారు. విభజించి పాలించే రాజకీయాలు దేశాన్ని నాశనం చేస్తున్నాయని ఆమె విమర్శించారు. మతసామరస్యంలో పశ్చిమబెంగాల్ యావత్ దేశానికే ఉదాహరణగా నిలిచిందని అన్నారు.

ఏకత్వం అనేది బెంగాలో మాత్రమే ఉందని, దేశంలోని ఏ ఇతర ప్రాంతంలో అది కనిపించదని మమతా చెప్పుకొచ్చారు. దేశంలో ప్రస్తుత పరిస్థితులను చూసి భయపడొద్దని, మంచి భవిష్యత్తు కోసం ఐక్యంగా ఎదురుచూడాలని ఆమె సూచించారు. దేశాన్ని విభజించి పాలించాలని, ప్రజలను అణిచివేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని ఆమె విజ్ఞప్తి చేశారు.

Mamata Attends Eid Prayer Meet, Says Politics Of Isolation Going On In India Not Welcome (1)

Mamata Attends Eid Prayer Meet, Says Politics Of Isolation Going On In India Not Welcome

‘హిందువులు, ముస్లింల మధ్య విభేదాలు సృష్టించేందుకు ప్రయత్నాలు కొనసాగుతునే ఉన్నాయి. అలాంటి వారిని చూసి మీరు భయపడవద్దు.. పోరాడుతూ ఉండాలని ఆమె సభలో చెప్పారు. తనపై నమ్మకం ఉంచాలని, తాను జీవించి ఉన్నంత వరకు ముస్లింలు లేదా హిందువులు లేదా సిక్కులు లేదా జైనులు అయినా ప్రజల కోసం పోరాడతానని ఈ రోజు వాగ్దానం చేస్తున్నానని వెల్లడించారు.

నాకు సారే జహాన్ సే అచ్ఛా హిందుస్థాన్ హమారా కావాలి అన్నారు. ఉర్దూలో తన ఆరు పుస్తకాలను ప్రస్తావిస్తూ.. తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి ముస్లింల పండుగల గురించిన ప్రతి నిత్యం తెలుసునని, ఇతర మతాల ఆచార వ్యవహారాల గురించి తనకు తెలుసునని అన్నారు. ‘మీ పండుగలతో పాటు నా మతానికి సంబంధించిన అన్ని విశేషాలు నాకు తెలుసునని చెప్పారు. తాను అన్ని మతాలను ప్రేమిస్తానని రాష్ట్ర ప్రజలకు బెనర్జీ ఈద్ ముబారక్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.

Read Also : Jodhpur Clashes : జోధ్‌పుర్‌లో మళ్లీ మత ఘర్షణలు.. ఇంటర్నెట్ సర్వీసులు బంద్..!