Jodhpur Clashes : జోధ్‌పుర్‌లో మళ్లీ మత ఘర్షణలు.. ఇంటర్నెట్ సర్వీసులు బంద్..!

Jodhpur Clashes : రంజాన్‌ పర్వదినాన రాజస్థాన్‌లోని జోధ్ పూర్ జిల్లాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మత ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది.

Jodhpur Clashes : జోధ్‌పుర్‌లో మళ్లీ మత ఘర్షణలు.. ఇంటర్నెట్ సర్వీసులు బంద్..!

Fresh Clashes In Jodhpur On Eid; Internet Suspended, Cm Calls For Peace (1)

Jodhpur Clashes : రంజాన్‌ పర్వదినాన రాజస్థాన్‌లోని జోధ్ పూర్ జిల్లాలో ఘర్షణ వాతావరణం నెలకొంది. మత ఘర్షణతో తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. ఈద్ సందర్భంగా జెండాలు, లౌడ్ స్పీకర్ల ఏర్పాటు చేయడంతో వివాదాస్పదానికి దారితీసింది. చిలికి చిలికి గాలివానలా మారి అల్లర్లకు దారి తీశాయి. రాజస్థాన్‌లోని జోధ్‌పుర్‌లో రెండు రోజులుగా వరుసగా మత ఘర్షణలు చోటుచేసుకున్నాయి. జోధ్‌పుర్‌లో రెండు వర్గాల మధ్య ఘర్షణల నేపథ్యంలో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. ఆందోళనకారులు పోలీస్ వాహనాలపై రాళ్ల వర్షం కురిపించారు. పలువురు పోలీసులు గాయపడ్డారు.

అప్రమత్తమైన పోలీసు యంత్రాంగం అదనపు బలగాలను మోహరించారు. అల్లర్లు మరింత పెరగడకుండా ఉండేందుకు ముందుస్తు జాగ్రత్త చర్యగా ఇంటర్నెట్‌ సేవలను నిలిపివేశారు. ఈద్‌ ప్రార్థనల సమయంలో జోధ్‌పుర్‌లో మరోసారి ఘర్షణలు చెలరేగాయి. జలోరీ గేట్‌ వద్ద జెండాలను ఏర్పాటు చేసే సమయంలో రెండు వర్గాల మధ్య ఘర్షణకు దారితీసింది. పరస్పరం రాళ్లు రువ్వుకున్నారు. రంగంలోకి దిగిన పోలీసులు అక్కడి పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు విసిరారు.

Fresh Clashes In Jodhpur On Eid; Internet Suspended, Cm Calls For Peace

Fresh Clashes In Jodhpur On Eid; Internet Suspended, Cm Calls For Peace

జోద్ పూర్ జిల్లాలోని 10 పోలీసు స్టేషన్ పరిధిలో సదర్‌కోత్వాలి, ఉదయమందిర్, సదర్‌బజార్ నగోరి గేట్, ఖండఫల్సా, ప్రతాప్‌నగర్, సుర్‌సాగర్, సర్దార్‌పురా పోలీస్ స్టేషన్, ప్రతాప్‌నగర్ సదర్ దేవ్‌నగర్ పరిధిలో కర్ఫ్యూను విధించారు. ఈ ఘటనపై రాష్ట్ర సీఎం అశోక్‌ గెహ్లాట్‌ స్పందించారు. జోధ్‌పూర్‌లో కొందరు ఉద్రిక్తతలు సృష్టిస్తున్నారని ఆరోపించారు. శాంతిభద్రతలు కాపాడాలని గెహ్లాట్ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.

Read Also : Eid-Ul-Fitr : రంజాన్‌ పర్వదినాన.. స్వీట్లు పంచుకున్న పాక్‌ రేంజర్లు-బీఎస్‌ఎఫ్‌‌ జవాన్లు