Partha Chatterjee: అవినీతి మంత్రిని పట్టించుకోని మమత.. ఫోన్ చేసినా స్పందించని సీఎం

అవినీతి కేసులో ఈడీ అరెస్టు చేసిన పశ్చిమ బెంగాల్ మంత్రికి మద్దతు కరువైంది. ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి పార్థ ఛటర్జీ ఫోన్ చేసినా ఆమె స్పందించలేదు. అధికారులు ఎవరికైనా ఫోన్ చేసుకునేందుకు ఇచ్చిన అవకాశం అలా వృథా అయింది.

Partha Chatterjee: అవినీతి మంత్రిని పట్టించుకోని మమత.. ఫోన్ చేసినా స్పందించని సీఎం

Partha Chatterjee

Partha Chatterjee: టీచర్ల రిక్రూట్‌మెంట్ స్కాంలో అరెస్టైన పశ్చిమ బెంగాల్ మంత్రి పార్థ ఛటర్జీ విషయంలో సొంతపార్టీ టీఎమ్‌సీతోపాటు, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ కూడా దూరం పాటిస్తున్నారు. ఈ విషయంలో ఆయనకు ఎవరూ పెద్దగా మద్దతుగా నిలవడం లేదు. టీచర్ల రిక్రూట్‌మెంట్ విషయంలో పార్థ కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడ్డట్లు ఆరోపణలొచ్చాయి.

AP Villages: తెలంగాణలో కలిపే వరకు పోరాటం ఆగదు: ఏపీ విలీన గ్రామాల ప్రజలు

ఆయన సన్నిహితుల దగ్గరి నుంచి కోట్ల రూపాయల నగదు కూడా ఈడీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ స్కాం విషయంలో రెండు రోజుల క్రితం పార్థ ఛటర్జీని ఈడీ అధికారులు అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఎవరినైనా ఈడీ అరెస్టు చేసే సమయంలో సన్నిహితుల్లో ఎవరో ఒకరికి ఫోన్ చేసే అవకాశం కల్పిస్తారు అధికారులు. పార్థకు కూడా ఈడీ అధికారులు ఎవరికైనా ఫోన్ చేసుకోవచ్చని సూచించారు. దీంతో ఆయన నేరుగా తమ పార్టీ అధినేత్రి, ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఫోన్ చేయాలనుకున్నారు. ఆమె తనకు సాయపడొచ్చని భావించారు. అలా నాలుగుసార్లు మమతకు ఫోన్ చేశారు. అర్ధరాత్రి రెండున్నర గంటల నుంచి ఉదయం తొమ్మిదిన్నర వరకు నాలుగుసార్లు సీఎంకు పార్థ ఛటర్జీ ఫోన్ చేశారు.

Laal Singh Chaddha : ఒకరికొకరు పానీపూరి తినిపించుకున్న అమీర్ ఖాన్, చిరంజీవి..

అయితే, ఈ ఫోన్ కాల్స్‌కు మమత స్పందించలేదు. ఈ విషయాన్ని ఛటర్జీ మీడియాకు కూడా వెల్లడించారు. తనను అధికారులు ఎక్కడికి తీసుకెళ్తున్నారో తెలియదని, తన పార్టీ అధినేత్రికి ఫోన్ చేసినప్పటికీ స్పందించలేదని మీడియాకు తెలిపారు. దీంతో పార్టీ నుంచి ఆయనకు మద్దతు కరువైనట్లు తెలుస్తోంది.