M.K.Stalin : సీఎం ఇంటికి బాంబు బెదిరింపు | M.K.Stalin

M.K.Stalin : సీఎం ఇంటికి బాంబు బెదిరింపు

తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇంట్లో, చెన్నై విమానాశ్రయంలో బాంబు పెట్టామని బెదిరింపు ఫోన్ కాల్ చేసిన యువకుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు.

M.K.Stalin : సీఎం ఇంటికి బాంబు బెదిరింపు

M.K.Stalin :  తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ ఇంట్లో, చెన్నై విమానాశ్రయంలో బాంబు పెట్టామని బెదిరింపు ఫోన్ కాల్ చేసిన యువకుడిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం చెన్నై పోలీసు కంట్రోల్ రూమ్ కు ఒక ఫోన్ కాల్ వచ్చింది. అందులో మాట్లాడిని వ్యక్తి స్టాలిన్ ఇంటికి, చెన్నై విమానాశ్రయానికి బాంబు పెట్టినట్లు చెప్పి ఫోన్ డిస్ కనెక్ట్ చేశాడు.

దీంతో పోలీసులు సీఎం ఇల్లు, విమానాశ్రయంలో బాంబు స్క్వాడ్,డాగ్ స్క్వాడ్ తో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబు లేదని తేల్చి ఊపిరి పీల్చుకున్నారు. అనంతరం ఫోన్ కాల్ చేసిన వ్యక్తిగురించి ఆరాతీశారు. నిందితుడు తిరునల్వేలి డిల్లా సుందమల్లి గ్రామానికి చెందిన తామరై కన్నన్ గా(32) గా గుర్తించి అరెస్ట్ చేశారు. తామరై కన్నన్ గంజాయికి, మద్యానికి బానిసయ్యాడని… మద్యం మత్తులో…. అకతాయి తనంతో బాంబు పెట్టినట్లు ఫోన్ చేశాడని తెలుసుకుని అరెస్ట్ చేసి చెన్నై తీసుకు వచ్చి విచారిస్తున్నారు.

Also Read : Kidney Stones: కిడ్నీలో 206రాళ్లను తొలగించిన డాక్టర్లు.. ఒక గంటలోనే

×