Kidney Stones: కిడ్నీలో 206రాళ్లను తొలగించిన డాక్టర్లు.. ఒక గంటలోనే

హైదరాబాద్ లోని అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ లో కీహోల్ సర్జరీ జరిపిన డాక్టర్లు గంటల్లో 206రాళ్లను తొలగించారు. ఆరు నెలలుగా బాధపడుతున్న పేషెంట్ కు.. ఉపశమనం అందించారు.

Kidney Stones: కిడ్నీలో 206రాళ్లను తొలగించిన డాక్టర్లు.. ఒక గంటలోనే

Kidney Stones

 

 

Kidney Stones: హైదరాబాద్ లోని అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ లో కీహోల్ సర్జరీ జరిపిన డాక్టర్లు గంటల్లో 206రాళ్లను తొలగించారు. ఆరు నెలలుగా బాధపడుతున్న పేషెంట్ కు.. ఉపశమనం అందించారు. నల్గొండకు చెందిన 56ఏళ్ల వీరమళ్ల రామలక్ష్మయ్య ఏప్రిల్ 22న అవారె గ్లెనీగల్స్ గ్లోబల్ హాస్పిటల్ వైద్యులను కలిశాడు.

లోకల్ హెల్త్ ప్రాక్టీషనర్ ఇచ్చిన మెడికేషన్ అనుసరిస్తున్న అతనికి తాత్కాలిక ఉపశమనం మాత్రమే దక్కుతుండగా.. సమస్య పూర్తిగా తగ్గించాలంటూ డాక్టర్లను రిక్వెస్ట్ చేశాడు.

“పేషెంట్ ఆరోగ్యం గురించి తెలుసుకున్నాం. అల్ట్రా సౌండ్ లాంటి వైద్యపరీక్షలు చేసి లెఫ్ట్ సైడ్ కిడ్నీలో చాలా రాళ్లు ఉన్నట్లు గుర్తించాం. సీటీ కబ్ స్కాన్ లో కూడా అదే కన్ఫామ్ అయింది”

Read Also : స్త్రీలకు కిడ్నీ వ్యాధుల ప్రమాదం ఎక్కువే?

“పేషెంట్ కు కౌన్సిలింగ్ ఇచ్చి కీహోల్ సర్జరీకి ప్రయత్నించాం. గంట సేపు జరిగిన సర్జరీలో 206రాళ్లను తొలగించాం. ఈ ప్రక్రియ అనంతరం పేషెంట్ చక్కగా కోలుకున్నారు. రెండో రోజే ఇంటికి డిశ్చార్జ్ చేశాం కూడా” అని వైద్యులు అంటున్నారు.

ఇలా కిడ్నీలో రాళ్లు ఉండటం వల్ల సమ్మర్ లాంటి వాతావరణంలో ఎక్కువగా డీహైడ్రేషన్ కు గురవుతుంటారు. జ్వరం వచ్చినట్లుగా పదేపదే అనిపిస్తుంటుంది. అటువంటి పరిస్థితి రాకుండా ఉండేందుకు ఎక్కువగా నీళ్లు, కొబ్బరి నీళ్లు తాగుతుండాలని వైద్యులు చెబుతున్నారు.