Manushi Chhillar : రాజమౌళి సినిమాలో నటించాలని ఉందన్న మాజీ ప్రపంచ సుందరి..

తాజాగా మానుషీ చిల్లర్ మాట్లాడుతూ.. ఫలానా డైరెక్టర్ దర్శకత్వంలో నటిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు. నా వరకు అయితే నేను చూసిన సినిమాల్లో ఏదైనా బాగా నచ్చితే ఆ డైరెక్టర్ దర్శకత్వంలో నటించాలని అనుకుంటాను. అలా నేను అనుకున్న దర్శకుల సినిమాల్లో............

Manushi Chhillar : రాజమౌళి సినిమాలో నటించాలని ఉందన్న మాజీ ప్రపంచ సుందరి..

Manushi Chhillar wants to work in under rajamouli direction

Manushi Chhillar :  మోడలింగ్ రంగంలో అడుగుపెట్టి మోడలింగ్ లో రాణిస్తూ మిస్ ఇండియా, మిస్ వరల్డ్ కిరీటాలని గెలుచుకుంది మానుషీ చిల్లర్. 2017 లో మిస్ వరల్డ్ గా ఎన్నికై ఇండియాకి ప్రపంచ సుందరి కిరీటాన్ని తీసుకొచ్చింది. దీంతో ఒక్కసారిగా ఇండియాలో పాపులర్ అయింది ఈ భామ. ఇక మోడలింగ్ లో ఇలా బాగా రాణించేవాళ్లంతా సినిమాల్లోకి అడుగు పెడతారని తెలిసిందే.

మానుషీ చిల్లర్ కూడా 2022 లో అక్షయ్ కుమార్ నటించిన సామ్రాట్ పృథ్వీరాజ్ సినిమాతో బాలీవుడ్ తెరకి పరిచయమైంది. ప్రస్తుతం మరో రెండు బాలీవుడ్ సినిమాల్లో నటిస్తుంది మానుషీ. తాజాగా ఇచ్చిన ఓ బాలీవుడ్ ఇంటర్వ్యూలో టాలీవుడ్ దర్శకుడు రాజమౌళితో కలిసి నటించాలని ఉందని చెప్పింది. రాజమౌళి బాహుబలితో దేశమంతటా పేరు తెచ్చుకొని RRR సినిమాతో ప్రపంచవ్యాప్తంగా పేరు సంపాదించారు. దీంతో చాలా మంది బాలీవుడ్, వేరే సినీ పరిశ్రమల వాళ్ళు కూడా రాజమౌళి దర్శకత్వంలో నటించాలని అనుకుంటున్నారు.

Nayanathara : బాలీవుడ్‌లో ఎంట్రీ ఇవ్వడానికి 20 ఏళ్ళు పట్టింది.. ఇన్నాళ్లు నాకు అవకాశాలు రాలేదు..

తాజాగా మానుషీ చిల్లర్ మాట్లాడుతూ.. ఫలానా డైరెక్టర్ దర్శకత్వంలో నటిస్తే బాగుంటుందని అందరూ అనుకుంటారు. నా వరకు అయితే నేను చూసిన సినిమాల్లో ఏదైనా బాగా నచ్చితే ఆ డైరెక్టర్ దర్శకత్వంలో నటించాలని అనుకుంటాను. అలా నేను అనుకున్న దర్శకుల సినిమాల్లో నటించే అవకాశం వస్తే బాగా సంతోషిస్తాను. ఇటీవలి కాలంలో RRR సినిమా బాగా నచ్చింది. ఆ సినిమా దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో నటించాలని అనుకుంటున్నాను. ఛాన్స్ వస్తుందేమో చూడాలి అని తెలిపింది. మరి ఈ మాజీ ప్రపంచ సుందరికి మన జక్కన్న ఛాన్స్ ఇస్తాడా అంటే చూడాలి.