Maoist Ravi died : బాంబులు తయారుచేస్తుండగా..పేలి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి

 బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు తాను తయారు చేసిన బాంబు పేలి మావోయిస్టు కేంద్రం కమిటీ సభ్యుడు రవి మృతిచెందాడు. రవి మృతిని మావోయిస్టు కేంద్ర కమిటీ దృవీకరించింది.

Maoist Ravi died : బాంబులు తయారుచేస్తుండగా..పేలి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు మృతి

Maoist Ravi Died

Maoist Ravi died : బాంబులు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తు తాను తయారు చేసిన బాంబు పేలి మావోయిస్టు నేత మృతిచెందాడు. జార్ఖండ్ లోని మారుమూల ప్రాంతంలో తాను తయారుచేసిన బాంబులను పరీక్షిస్తున్న సమయంలోనే ప్రమాదవశాత్తూ అవి పేలడంతో మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు రవి మృతి చెందాడు. రవి మృతిని మావోయిస్టులు ధృవీకరించారు. కాగా ఈ ఘటన జరిగి సంవత్సరంన్నర కావస్తుంది. కానీ తయారుచేసిన బాంబులు పేలటంతో రవి మృతి చెందాడని ఇన్నాళ్లికి కేంద్ర కమిటీ ఆలస్యంగా రవి మృతిని వెల్లడించింది.

2020లో ఘటన..ఆలస్యంగా ప్రకటించిన కమిటీ..
రవి మావోయిస్టు దళంలో టెక్నికల్ టీంలో సభ్యుడు. రవికి కమ్యునికేషన్స్‌తో పాటు ఎలక్ర్టికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారుచేయడంలో ఎక్స్ పర్ట్. అలా బాంబులు తయారుచేసి..వాటిని పరిశీలిస్తున్న సమయంలో ప్రమాదవశాత్తు గత ఏడాది అంటే జూన్ 5, 2020 న జార్ఖండ్‌లో రవి మృతిచెందాడు. రవి మృతి తమకు ఎంతో తీరని నష్టం అని..రవికి విప్లవ లాంఛనాలతో అంత్యక్రియలు జరిపామని మావోయిస్ట్‌ పార్టీ వెల్లడించింది.

Read more : Maoist RK Death : ఆర్కే చనిపోయాడు.. అంత్యక్రియలు అయిపోయాయి

ఐఈడీలు అమర్చడంలో రవి ఎక్స్ పర్ట్..
కాగా రవి నెల్లూరు జిల్లాకు చెందిన వ్యక్తి. రవి తన జీవితంలో జరిగిన కొన్ని ఘటనల కారణంగా మావోయిస్టు కార్యకలాపాల పట్ల ఆకర్షితుడయ్యాడు. 2014 గెరిల్లా జోన్ నుంచి విధులు నిర్వర్తించాడు. జార్ఖండ్‌లో ఈఆర్‌బీ స్టాఫ్‌గా పనిచేశాడు. రవికి కంప్యూటర్‌ టెక్నాలజీలో మంచి పట్టుంది. ఎలక్ర్టిల్స్, ఎలక్ట్రానిక్స్‌ వంటి విషయాలపై చాలా అవగాహన ఉంది. ముఖ్యంగా బాంబులు పేల్చేందుకు ఎలక్ట్రానిక్స్ పరికరాలు తయారుచేయడంలో రవి అందెవేసిన చేయి. అతను తయారు చేసినవి ఫెయిల్ అయిన సందర్భాలే లేవు. అలాగే అత్యాధునిక ఐఈడీలు అమర్చడంలో బాగా ఆరితేరాడు.

ముఖ్యంగా ప్రజావిముక్తి గెరిల్లా సైన్యానికి(పీఎల్‌జీఏ)కు అత్యాధునిక ఆయుధాలు సమకూర్చడంలో రవిది అంత్యం కీలక పాత్ర. ఈక్రమంలోనే రవి పలు బాంబులు తయారుచేశాడు. తాను తయారుచేసిన బాంబులను పరీక్షిస్తున్న సమయంలోనే రవి అవే బాంబులు పేలి ప్రాణాలు కోల్పోవటం గమనించాల్సిన విషయం. రవి మరణం విషయాన్ని మావోయిస్ట్‌ కేంద్ర కమిటీ రవి కుటుంబానికి వెల్లడించారు.