vice president polls: ఉప రాష్ట్రప‌తి ఎన్నికలో అభ్య‌ర్థిగా త‌న‌పేరును ప్ర‌క‌టించ‌డంపై మార్గ‌రెట్ అల్వా తొలి స్పంద‌న‌

''విప‌క్ష పార్టీలు త‌మ ఉమ్మ‌డి ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా నా పేరును ప్రకటించ‌డాన్ని గౌర‌వ‌ప్ర‌దంగా భావిస్తున్నాను. అందుకు నేను స‌విన‌యంగా అంగీక‌రిస్తున్నాను. నా మీద న‌మ్మ‌కం ఉంచినందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను'' అని మార్గ‌రెట్ అల్లా ట్వీట్ చేశారు.

vice president polls: ఉప రాష్ట్రప‌తి ఎన్నికలో అభ్య‌ర్థిగా త‌న‌పేరును ప్ర‌క‌టించ‌డంపై మార్గ‌రెట్ అల్వా తొలి స్పంద‌న‌

Alva

vice president polls: ఉప రాష్ట్రప‌తి ఎన్నికలో విప‌క్షాల అభ్య‌ర్థిగా మాజీ గ‌వ‌ర్న‌ర్ మార్గ‌రెట్ అల్వా(80) పోటీ చేస్తార‌ని ఎన్సీపీ అధినేత శ‌ర‌ద్ ప‌వార్ ప్ర‌క‌టించిన విషయం తెలిసిందే. ఢిల్లీలో విప‌క్ష పార్టీల నేత‌ల స‌మావేశం అనంతరం ఆయ‌న ఈ ప్ర‌క‌ట‌న చేశారు. విప‌క్ష పార్టీల‌ త‌ర‌ఫున‌ ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా త‌న పేరును ప్ర‌క‌టించ‌డంపై మార్గ‌రెట్ అల్వా తొలిసారి స్పందించారు.

”విప‌క్ష పార్టీలు త‌మ ఉమ్మ‌డి ఉప రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా నా పేరును ప్రకటించ‌డాన్ని గౌర‌వ‌ప్ర‌దంగా భావిస్తున్నాను. అందుకు నేను స‌విన‌యంగా అంగీక‌రిస్తున్నాను. నా మీద న‌మ్మ‌కం ఉంచినందుకు ప్ర‌తిప‌క్ష పార్టీల నేత‌ల‌కు కృత‌జ్ఞ‌త‌లు చెబుతున్నాను” అని మార్గ‌రెట్ అల్వా ట్వీట్ చేశారు. కాగా, ఆమె గ‌తంలో గోవా, రాజ‌స్థాన్, గుజ‌రాత్, ఉత్త‌రాఖండ్ రాష్ట్రాల‌కు గ‌వ‌ర్న‌ర్‌గా ప‌నిచేశారు.

మ‌రోవైపు, విప‌క్ష పార్టీలు అభ్య‌ర్థిని ప్ర‌క‌టించ‌డం ప‌ట్ల కేంద్ర మంత్రి గ‌జేంద్ర షెకావ‌త్ స్పందిస్తూ… త‌మ‌కు మెజారిటీ ఉంద‌ని, ఇత‌ర అభ్య‌ర్థి గెలిచే అవ‌కాశం లేద‌ని అన్నారు. విప‌క్షాలు అభ్య‌ర్థిని పోటీకి దింప‌క‌పోతే బాగుండేద‌ని ఆయ‌న‌ చెప్పారు. ఆగస్టు 6న ఉపరాష్ట్రపతి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. జూలై 19 వ‌ర‌కు నామినేషన్లు స్వీక‌రిస్తారు. జూలై 20న నామినేషన్ల పరిశీలన ఉంటుంది. జూలై 22 నామినేషన్ల ఉపసంహరణకు ఆఖరి తేదీ.

Sanjay Raut: కేబినెట్‌లో ఇద్ద‌రే ఉన్నారు.. మ‌హారాష్ట్రలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి: సంజయ్ రౌత్