Sanjay Raut: కేబినెట్‌లో ఇద్ద‌రే ఉన్నారు.. మ‌హారాష్ట్రలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి: సంజయ్ రౌత్

సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చేవ‌ర‌కు మ‌హారాష్ట్రలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలని శివ‌సేన నేత‌ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేటుకు సంబంధించిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం బుధ‌వారం విచారించ‌నుంది.

Sanjay Raut: కేబినెట్‌లో ఇద్ద‌రే ఉన్నారు.. మ‌హారాష్ట్రలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలి: సంజయ్ రౌత్

Shiv Sena Mp Sanjay Raut

Sanjay Raut: సుప్రీంకోర్టు తీర్పు వ‌చ్చేవ‌ర‌కు మ‌హారాష్ట్రలో రాష్ట్ర‌ప‌తి పాల‌న విధించాలని శివ‌సేన నేత‌ సంజయ్ రౌత్ డిమాండ్ చేశారు. శివ‌సేన రెబ‌ల్ ఎమ్మెల్యేలపై అన‌ర్హ‌త వేటుకు సంబంధించిన పిటిష‌న్ల‌పై సుప్రీంకోర్టు ప్ర‌ధాన న్యాయ‌మూర్తి జ‌స్టిస్ ఎన్వీ ర‌మ‌ణ‌కు నేతృత్వంలోని ధ‌ర్మాస‌నం బుధ‌వారం విచారించ‌నుంది. ఈ నేప‌థ్యంలో సంజ‌య్ రౌత్ స్పందిస్తూ… ”బార్బ‌డోస్ దేశ జ‌నాభా 2.5 ల‌క్ష‌లు ఉంటుంది. అయిన‌ప్ప‌టికీ వారి కేబినెట్‌లో 27 మంది ఉన్నారు. మ‌హారాష్ట్ర జ‌నాభా 12 కోట్లు ఈ రాష్ట్ర కేబినెట్‌లో కేవ‌లం ఇద్ద‌రు మాత్ర‌మే ఉండి, ఏక‌ప‌క్ష నిర్ణ‌యాలు తీసుకుంటున్నారు. రాజ్యాంగం ప్ర‌కారం వారు న‌డుచుకోవ‌డం లేదు.

కేబినెట్‌లో ముఖ్య‌మంత్రితో క‌లిపి12 మంది కంటే త‌క్కువ మంది మంత్రులు ఉండ‌డానికి వీల్లేద‌ని రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 164 (1-ఏ) చెబుతోంది. అయిన‌ప్ప‌టికీ రెండు వారాల నుంచి ఈ ఇద్ద‌రు వ్య‌క్తుల‌ (ఏక్‌నాథ్ షిండే, ఫ‌డ్న‌వీస్‌) కేబినెట్ తీసుకుంటోన్న నిర్ణ‌యాలు రాజ్యాంగ‌బ‌ద్ధంగా చెల్ల‌వు. గౌర‌వ‌నీయులైన గ‌వ‌ర్న‌ర్ స‌ర్.. ఏం జ‌రుగుతోంది ఇక్క‌డ‌?” అని ట్వీట్ చేశారు. కాగా, ముఖ్య‌మంత్రిగా ఏక్‌నాథ్ షిండే ప్ర‌మాణ స్వీకారం చేయ‌డ‌మే ఎన్నో సందేహాల‌తో కూడుకుని ఉంద‌ని శివ‌సేన అంటోంది.

K Kavitha: రాహుల్ గాంధీ భార‌త్‌లోనే ఉన్నారా?: క‌విత చుర‌క‌లు