Mary Kom: రోజూ 15 కిలోమీటర్ల పరుగు.. తన ఫిట్‌నెస్ ప్లాన్ వెల్లడించిన మేరీ కోమ్

మేరీ కోమ్ తన ఫిట్‌నెస్‌ ప్లాన్ వెల్లడించారు. ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. తాను ఎప్పుడూ ‘ఎ హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ’ అనే సూత్రాన్ని ఫాలో అవుతారు. ప్రతి రోజూ 15 కిలోమీటర్లు పరుగెడతారు.

Mary Kom: రోజూ 15 కిలోమీటర్ల పరుగు.. తన ఫిట్‌నెస్ ప్లాన్ వెల్లడించిన మేరీ కోమ్

Mary Kom: బాక్సింగ్ ఛాంపియన్ మేరీ కోమ్ పూర్తి ఫిట్‌నెస్‌తో ఉంటారు. బాక్సింగ్‌లో రాణించాలంటే ఎల్లప్పుడూ క్రీడాకారులు తమ ఫిట్‌నెస్‌ కాపాడుకోవాల్సిందే. మరి అలాంటి క్రీడాకారుల ఫిట్‌నెస్‌ ప్లాన్ ఎలా ఉంటుందో తెలుసుకోవాలని చాలా మందికి ఉంటుంది. తాజాగా మేరీ కోమ్ తన ఫిట్‌నెస్‌ ప్లాన్ వెల్లడించారు.

Bihar: రోజు కూలీకి ఐటీ అధికారుల షాక్.. రూ.14 కోట్లు పన్ను కట్టాలంటూ నోటీసులు

ఆమె చెప్పిన వివరాల ప్రకారం.. తాను ఎప్పుడూ ‘ఎ హెల్దీ మైండ్ ఇన్ హెల్దీ బాడీ’ అనే సూత్రాన్ని ఫాలో అవుతారు. ప్రతి రోజూ 15 కిలోమీటర్లు పరుగెడతారు. బాక్సింగ్ ప్రాక్టీస్ చేస్తారు. అలాగే కార్డియో వర్కవుట్ కూడా చేస్తుంటారు. దీని వల్ల ఒంట్లోని కొవ్వు కరగడంతోపాటు, శక్తి పెరుగుతుంది. కండరాలు బలంగా తయారవుతాయి. గుండె ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే విడతల వారీగా బాక్సింగ్ మాత్రమే కాకుండా వేరే గేమ్స్ కూడా ఆడుతారు. స్కిప్పింగ్ రోప్, షాడో బాక్సింగ్, వెయిట్ ట్రైనింగ్, బ్యాడ్మింటన్ వంటివి కూడా ఆడుతారు. రోజూ అన్ని పోషకాలు అందేలా మేరీ కోమ్ డైట్ ఉంటుంది. వర్కవుట్ స్టార్ట్ చేసేముందు న్యూట్రియస్ షేక్ తీసుకుంటారు.

Sukesh Chandrasekhar: ఆమ్ ఆద్మీ పార్టీకి రూ.60 కోట్లు ఇచ్చా.. సుకేష్ చంద్రశేఖర్ తాజా ఆరోపణ

ఆమె డైట్‌లో రైస్, గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్స్, మాంసం, బ్రెడ్ వంటివి ఉంటాయి. అప్పుడప్పుడు మాత్రం జిలేబి లేదా ఐస్ క్రీమ్ తీసుకుంటారు. వర్కవుట్ తర్వాత బ్రేక్ ఫాస్ట్ చేస్తారు. ఇందులో గ్రీన్ వెజిటబుల్స్, ఫ్రూట్ జ్యూస్, బ్రెడ్, ఎగ్ ఉంటాయి. లంచ్ మెనూలో మాంసం, పప్పు ధాన్యాలు, కూరగాయలు, రోటీ ఉంటాయి. ప్రోటీన్ అందడం కోసం మాంసం తీసుకుంటారు. అలాగే ఫ్రూట్ జ్యూస్‌తోపాటు, రోజులో తగినన్ని నీళ్లు తాగుతుంటారు.

 

 

View this post on Instagram

 

A post shared by Mangte Mary Kom (@mcmary.kom)