Khiladi-DJ Tillu: మాస్ రాజా రొటీన్ కంటెంట్ VS టిల్లు గాడి హిలేరియస్!

సినీ పరిశ్రమ కరోనా నుండి కోలుకున్న అనంతరం ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ వారం మాస్ రాజా రవితేజ ఖిలాడీ, సిద్ధూ డీజే టిల్లు, సెహరీ సినిమాలు థియేటర్లలో..

Khiladi-DJ Tillu: మాస్ రాజా రొటీన్ కంటెంట్ VS టిల్లు గాడి హిలేరియస్!

Khiladi Dj Tillu

Khiladi-DJ Tillu: సినీ పరిశ్రమ కరోనా నుండి కోలుకున్న అనంతరం ప్రతి వారం కొత్త సినిమాలు థియేటర్లలోకి వచ్చేస్తున్నాయి. ఈ వారం మాస్ రాజా రవితేజ ఖిలాడీ, సిద్ధూ డీజే టిల్లు, సెహరీ సినిమాలు థియేటర్లలో విడుదలయ్యాయి. రవితేజ ఖిలాడీ తొలి షో నుండే మిక్సెడ్ టాక్ తెచ్చుకోగా.. సెహరీ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోతుంది. ఈ వారం రిలీజైన సినిమాలలో తొలి షోతోనే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సినిమా డీజే టిల్లు.

Star Heroins: స్ట్రాంగ్ క్యారెక్టర్స్‌తో హీరోయిన్స్.. హీరోలతోనే పోటీ!

సెహరీ సినిమా సంగతి అలా ఉంచితే రవితేజ ఖిలాడీ సినిమా డీజే టిల్లుకి కాంపిటీషన్ అవుతుందని అనుకున్నారు. అందుకే ఖిలాడీ శుక్రవారం వస్తే డీజే టిల్లు ఒకరోజు గ్యాప్ ఇచ్చి శనివారం థియేటర్లలోకి వచ్చాడు. కానీ.. ఖిలాడీ రొటీన్ కంటెంట్ పెద్దగా ప్రేక్షకులకు ఎక్కలేదు. దీనికి తోడు దర్శకుడు రమేష్ వర్మ.. రవితేజల మధ్య కోల్డ్ వార్.. రమేష్ వర్మ భార్య రవితేజ చెత్త యాక్టర్ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు కూడా ఖిలాడీకి దెబ్బ కొట్టాయి.

Mohan Babu: జగన్, చంద్రబాబు ఇద్దరూ బంధువులే.. మోహన్ బాబు ఆసక్తికర వ్యాఖ్యలు!

ఇక డీజే టిల్లు కామెడీకి యూత్ బాగా కనెక్ట్ అయ్యారు. సిద్ధూ మేనరిజమ్స్.. అర్బన్ లాంగ్వేజ్ యూత్ కి బాగా కనెక్ట్ అయింది. ఓవర్సీస్ లో కూడా టిల్లు హవా గట్టిగానే కనిపిస్తుండడంతో.. ఫైనల్ గా జాతిరత్నాలు తర్వాత టిల్లు గాడు హిలేరియస్ కామెడీతోనే సక్సెస్ అయిపోయాడని విశ్లేషకులు తేల్చేశారు. కొన్ని సీన్లు మినహా టిల్లు గాడు యూత్ కి తెగ నచ్చేస్తున్నాడు. దీంతో ఫైనల్ గా ఈ వారం సినిమాలలో టిల్లు గాడే తోపు అయ్యాడు.