Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ సేఫ్.. అల్లు అరవింద్ కీలక ప్రకటన

రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్న

Sai Dharam Tej : సాయిధరమ్ తేజ్ సేఫ్.. అల్లు అరవింద్ కీలక ప్రకటన

Sai Dharam Tej Very Safe

Sai Dharam Tej : రోడ్డు ప్రమాదంలో మెగా హీరో సాయిధరమ్ తేజ్ గాయపడిన సంగతి తెలిసిందే. స్పోర్ట్స్ బైక్ నుంచి ప్రమాదవశాత్తు కిందపడటంతో తేజ్ కు తీవ్ర గాయాలు అయ్యాయి. కుడి కన్ను, ఛాతి, పొట్టపై గాయాలు ఉన్నాయి. ప్రమాదం జరిగిన వెంటనే షాక్ కి గురి కావడంతో సాయితేజ్‌ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. తేజ్ ను హైటెక్ సిటీలోని మెడికవర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యం కోసం జూబ్లిహిల్స్ అపోలో ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించారు. తేజ్ సేఫ్ గా ఉన్నాడని ఆయన స్పష్టం చేశారు.

”తేజ్ కు యాక్సిడెంట్ జరిగింది. ప్రస్తుతం సేఫ్ గా ఉన్నాడు. డాక్టర్లతో మాట్లాడాక ఫ్యామిలీ తరుఫున నేను చెబుతున్నా. తేజ్ ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లందరితో మాట్లాడి వచ్చి నేను చెబుతున్నాను. తేజ్ ఈజ్ వెరీ సేఫ్. రేపటికి మామూలు అవుతాడని, మాట్లాడతాని డాక్టర్లు చెప్పారు. మీడియాలో రకరకాల వార్తలు రాకుండా, అవాస్తవాలు బయటకు వెళ్లకూడదనే ఫ్యామిలీ తరుఫున నేను వచ్చి చెబుతున్నాను. హీ ఈజ్ వెరీ వెరీ సేఫ్. హెడ్ ఇంజ్యురీ కానీ, స్పైనల్ ఇంజ్యురీ కానీ ఏమీ లేవు. ఇంటర్నల్ బ్లీడింగ్స్ ఎక్కడా లేవు అని డాక్టర్లు చెప్పారు” అని అల్లు అరవింద్ తెలిపారు.

శుక్రవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో హైదరాబాద్ లో ఈ ప్రమాదం జరిగింది. దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి దాటాక ఐకియా వైపు వెళ్తుండగా ఈ
యాక్సిడెంట్ జరిగిందని పోలీసులు తెలిపారు. తేజ్ రైడ్ చేస్తున్న బండి నెంబర్ TS07 GJ1258. ఇది సరికొత్త బైక్. హై ఎండ్ బైక్ అని చెప్పాలి. చూడగానే ఆకట్టుకునే మోడల్. రేసింగ్ బైక్. 228 కేజీల బరువు ఉంటుంది.

బైక్ రైడింగ్ అంటే తేజ్ కు ఇష్టం. షూటింగ్ లేని సమయంలో తన బైక్ లేదా స్నేహితుల బైక్ తీసుకుని సరదాగా రైడింగ్ కు వెళతాడు. ఈ క్రమంలోనే శుక్రవారం కూడా బైక్ రైడ్ చేస్తున్నాడు. కేబుల్ బ్రిడ్జి దాటాక బైక్ స్పీడ్ ని అదుపు చేయలేక కిందకు పడ్డాడు. ప్రమాదంలో గాయాలు అయ్యాయి. తేజ్ అవుట్ ఆఫ్ డేంజర్ అని డాక్టర్లు చెబుతున్నా.. అపస్మారక స్థితిలో ఉండటం ఆందోళనకు గురి చేస్తోంది. షాక్ కి గురి కావడం వల్లే అపస్మారక స్థితికి చేరుకున్నాడని డాక్టర్లు చెప్పారు.