Chiranjeevi : చిరంజీవి చేతికి గాయం

మెగాస్టార్ చిరంజీవి చేతి గాయం గురించి మెగా కాంపౌండ్ టీమ్ స్పందించింది..

Chiranjeevi : చిరంజీవి చేతికి గాయం

Chiranjeevi

Chiranjeevi: క‌రోనా క్రైసిస్ సెకండ్ వేవ్ స‌మ‌యంలో ఆక్సిజ‌న్ బ్యాంకుల్ని స్థాపించి, మెగాస్టార్ చిరంజీవి ఇరు తెలుగు రాష్ట్రాల్లో సేవ‌లందించిన సంగ‌తి తెలిసిందే. ఈ సేవ‌ల్లో అన్ని జిల్లాల నుంచి మెగాభిమాన సంఘాల ప్ర‌తినిధులు పాలుపంచుకున్నారు. అందుకే ఆదివారం రోజు తెలంగాణ జిల్లాల నుంచి ఆక్సిజ‌న్ సేవ‌ల్లో పాల్గొన్న ప్ర‌తినిధుల్ని పిలిచి చిరు అభినందించారు. హైద‌రాబాద్‌లోని చిరంజీవి బ్ల‌డ్ బ్యాంక్ వేదిక‌గా ఈ కార్య‌క్ర‌మం జరిగింది.

AHA : ‘ఆహా’లో ‘లవ్ స్టోరీ’.. డిటిటల్ ట్రైలర్ చూశారా

అయితే ఈ కార్యక్రమంలో చిరు చేతికి కట్టుతో కనిపించారు. దీంతో చిరంజీవి చేతికి గాయమయ్యింది. షూటింగులో గాయపడ్డారా అంటూ సోషల్ మీడియాలో వార్తలు వ్యాపిస్తున్నాయి. తాజాగా ఈ విషయం గురించి మెగా కాంపౌండ్ టీమ్ స్పందించారు.

SPIRIT: క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో బెబో

‘ఇంటిదగ్గర జిమ్ చేస్తుండగా చిరంజీవి చెయ్యి బెనికింది. ఒకటీ, రెండు రోజుల్లో డాక్టర్స్ కట్టు తొలగించానున్నారు. ఇది చాలా చిన్న విషయం. ఆందోళన చెందాల్సిన పని లేదు. చిరంజీవి నటిస్తున్న ‘గాడ్ ఫాదర్’ షెడ్యూలె ఈ నెల 14తో ముగిసింది. తర్వాతి షెడ్యూల్ నవంబర్ 1 నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్‌లో జరుగనుంది. చిరంజీవికి ఈ నెలాఖరు వరకు షూటింగ్ లేదు. ‘భోళా శంకర్’ షూటింగ్ నవంబర్ 11 న హైదారాబాద్‌లో ప్రారంభం కానుంది’ అని తెలిపారు.

SPIRIT: క్రేజీ కాంబో.. డార్లింగ్‌తో బెబో