Chiranjeevi : ఉపేంద్ర డైరెక్షన్లో మెగాస్టార్ సినిమా.. కానీ అలా మిస్ అయిపోయింది..
గని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ..''నేను నటించిన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాను. కానీ అంతకుముందే తెలుగు పరిశ్రమలో నాకు.......

Chiranjeevi
Upendra : వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ‘గని’ సినిమా ఈ రోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదల అవుతుంది. ఈ సినిమాలో ముఖ్యపాత్రల్లో కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కూడా నటించారు. హీరోగా, డైరెక్టర్ గా ఇప్పటికే తెలుగు, కన్నడలో చాలా సినిమాలు చేశారు. హీరో కంటే ముందు డైరెక్టర్ గానే ఉపేంద్ర పరిశ్రమకి పరిచయమయ్యారు. ప్రస్తుతం ‘గని’ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా ఉపేంద్ర పలు ఆసక్తికర విషయాలని తెలియచేశాడు.
Rahul Sipligunj : గోవాలో రాహుల్.. డ్రగ్స్ వ్యవహారంలో నన్ను నమ్మట్లేదంటూ పోస్ట్..
గని సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర మాట్లాడుతూ..”నేను నటించిన సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకి దగ్గరయ్యాను. కానీ అంతకుముందే తెలుగు పరిశ్రమలో నాకు భాగం ఉంది. నేను డైరెక్టర్ గా ఉన్నప్పుడే 24 సంవత్సరాల క్రితం హీరో డా. రాజశేఖర్‌తో ‘ఓంకారం’ అనే సినిమాని డైరెక్షన్ చేశాను. అప్పట్నుంచే నాకు మెగా ఫ్యామిలీతో మంచి రిలేషన్ ఉంది. ఆ సమయంలో అశ్వినీదత్ నిర్మాణంలో మెగాస్టార్ చిరంజీవిని డైరెక్ట్ చేసే ఆఫర్ కూడా వచ్చింది. కానీ నాకు ఆ సమయంలో ఉన్న బిజీ షెడ్యూల్స్ వల్ల అదృష్టం లేక ఆ సినిమా చేయలేకపోయాను. మెగాస్టార్ తో సినిమా మిస్ అయినందుకు ఇప్పటికి బాధపడుతుంటాను” అని తెలిపారు. ఒకవేళ ఉపేంద్ర డైరెక్షన్ లో చిరంజీవి సినిమా తీసి ఉంటే కచ్చితంగా ఓ డిఫరెంట్ స్టోరీ చూసేవాళ్ళం.