Rahul Sipligunj : గోవాలో రాహుల్.. డ్రగ్స్ వ్యవహారంలో నన్ను నమ్మట్లేదంటూ పోస్ట్..
రాహుల్ తన ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియో కింద..''నన్ను నమ్మడానికి, నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరూ రెడీగా లేరు..........

Rahul
Rahul Sipligunj : ఇటీవల సమయానికి మించి అర్ధరాత్రి పూట పబ్ నడుపుతున్నారని బంజారాహిల్స్ రాడిసన్ బ్లూ హోటల్లోని ఫుడింగ్ అండ్ మింక్ పబ్‌లో పోలీసులు దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ దాడిలో అక్కడ డ్రగ్స్ దొరకడంతో ఈ వార్త సంచలనంగా మారింది. అంతే కాకుండా ఆ పబ్ లో ఆ సమయానికి ఉన్న 150 మందిని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. అందులో చాలా మంది ప్రముఖుల పిల్లలు ఉన్నారు. టాలీవుడ్ ప్రముఖులు కూడా ఉన్నారు. అందులో ప్రముఖ సింగర్, బిగ్‌బాస్ విన్నర్ రాహుల్ సిప్లిగంజ్ కూడా ఉన్నారు.
ఇలా పబ్ లో దొరకడంతో సోషల్ మీడియాలో, యూట్యూబ్ లలో వీరిపై అనేక కథనాలు ప్రచురితమయ్యాయి. అయితే వీరు డ్రగ్స్ తీసుకోలేదు, కేవలం పార్టీకి మాత్రమే వెళ్ళాం అని చెప్పినా ఇంకా చాలా మంది వీరి గురించి నెగిటివ్ గానే ప్రచారం చేస్తున్నారు. రాహుల్ సిప్లిగంజ్ కూడా దీనిపై మాట్లాడుతూ నేను కేవలం పార్టీకి వెళ్ళాను, నాకు డ్రగ్స్ కి ఎలాంటి సంబంధం లేదు అంటూ మీడియాకి వివరణ ఇచ్చారు. తాజాగా రాహుల్ ఓ వీడియోని పోస్ట్ చేసి ఆ వీడియోతో పాటు ఓ మ్యాటర్ ని కూడా పోస్ట్ చేశాడు. ఇప్పుడు రాహుల్ చేసిన ఆ పోస్ట్ వైరల్ గా మారింది.
NTR : ఎన్టీఆర్ పెట్టుకున్న వాచ్ ఖరీదు ఎంతో తెలుసా.. ఆ కాస్ట్ తో ఒక చిన్న సినిమా తీసేయొచ్చు
రాహుల్ తన ఫ్రెండ్స్ తో కలిసి గోవాకి వెళ్లి అక్కడ ఎంజాయ్ చేస్తున్న వీడియోని పోస్ట్ చేశాడు. ఆ వీడియో కింద..”నన్ను నమ్మడానికి, నిజాన్ని అర్థం చేసుకోవడానికి ఎవరూ రెడీగా లేరు. అయినా నా మీద నాకు నమ్మకం ఉంది. నిజం ఏంటో నాకు తెలుసు. నా ఫ్రెండ్ రాజేష్ కి థ్యాంక్స్ ఇలాంటి ఫేక్ న్యూస్ నుంచి నన్ను ఇంత దూరం తీసుకొచ్చినందుకు” అంటూ పోస్ట్ చేశాడు.
Krithi Shetty-Sreeleela: సౌత్‌ని ఏలుతున్న పూజా, రష్మిక.. ఈ ఇద్దరూ రీప్లేస్ చేస్తారా?
అయితే రాహుల్ ఇలా గోవాలో ఎంజాయ్ చేయడం పోస్ట్ చేయగా కొంతమంది హైదరాబాద్ లో ఎంజాయ్ అయిపొయింది, ఇప్పుడు గోవాకి వెళ్ళావా అని కామెంట్స్ చేస్తుండగా, కొంతమంది నీకు మేము సపోర్ట్ ఉన్నాం రాహుల్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.