Manipur Violence: మణిపూర్ అంశంపై ప్రధానమంత్రికి పోటాపోటీగా లేఖలు రాసిన మైతీ, కుకీ ఎమ్మెల్యేలు.. ఇంతకీ ఆ లేఖల్లో ఏం ఉందంటే?

కుల హింసకు గురవుతున్న మణిపూర్‌లో కేంద్ర బలగాలతో పాటు అస్సాం రైఫిల్స్‌ను మోహరించారు. రాష్ట్రంలోని మెజారిటీ మైతీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదాను మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం కుకీలు ర్యాలీ చేపట్టారు

Manipur Violence: మణిపూర్ అంశంపై ప్రధానమంత్రికి పోటాపోటీగా లేఖలు రాసిన మైతీ, కుకీ ఎమ్మెల్యేలు.. ఇంతకీ ఆ లేఖల్లో ఏం ఉందంటే?

Updated On : August 11, 2023 / 12:40 PM IST

మణిపూర్‌లో 3 నెలలకు పైగా కుకీ, మైతీ అనే రెండు జాతుల మధ్య కొనసాగుతోంది. అయితే ఇది కాస్త మరింత ముదిరి దేశంలోని పురాతన పారామిలిటరీ దళం అస్సాం రైఫిల్స్‌పై వివాదం ప్రారంభమైంది. తాజాగా దేశ ప్రధానమంత్రికి ఇరు వర్గాల ఎమ్మెల్యేలు వేరు వేరు లేఖలు రాశారు. ఇరు వర్గాల వారు అస్సాం రైఫిల్స్ మీద ప్రధానికి పలు అభ్యర్థనలు చేశారు. ఈ లేఖల్లో ఇరు వర్గాలు వేర్వేరు డిమాండ్లు ప్రధాని ముందుంచాయి. కుల హింసకు గురవుతున్న మణిపూర్‌లో కేంద్ర బలగాలతో పాటు అస్సాం రైఫిల్స్‌ను మోహరించారు. రాష్ట్రంలోని మెజారిటీ మైతీ కమ్యూనిటీకి షెడ్యూల్డ్ తెగ హోదాను మంజూరు చేస్తూ హైకోర్టు ఉత్తర్వులు ఇచ్చిన అనంతరం కుకీలు ర్యాలీ చేపట్టారు. అనంతరమే కుల హింస చెలరేగింది.

Flying Kiss Issue: రాహుల్ ‘ఫ్లైయింగ్ కిస్’ వివాదాన్ని మరో లెవెల్‭కి తీసుకెళ్లిన కాంగ్రెస్ ఎమ్మెల్యే

కుల హింస సమయంలో మోహరించిన అస్సాం రైఫిల్స్‌ను రాష్ట్రం నుండి తొలగించాలని 40 మంది ఎమ్మెల్యేలు (ఎక్కువగా మెయిటీలు) ప్రధానికి రాసిన లేఖలో డిమాండ్ చేశారు. 40 మంది శాసనసభ్యుల లేఖలో అస్సాం రైఫిల్స్ వారి ప్రస్తుత పోస్టింగ్‌ల నుంచి ఉపసంహరించుకోవాలని రాష్ట్రంలో భద్రత, స్థిరత్వాన్ని పునరుద్ధరించడానికి రాష్ట్ర భద్రతా దళాలతో పాటు విశ్వసనీయమైన కేంద్ర బలగాలను భర్తీ చేయాలని కోరారు. ఇక 10 మంది కుకీ ఎమ్మెల్యేలు కూడా ప్రధాని మోదీకి లేఖ రాశారు. అందులో అస్సాం రైఫిల్స్‌ను తొలగించవద్దని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఇదే జరిగితే రాష్ట్రంలోని గిరిజనుల భద్రతకు ప్రమాదం వాటిల్లుతుందని కుకీ శాసనసభ్యులు పేర్కొన్నారు.

Sunil Kumar Sharma: బిహార్ నుంచి నకిలీ డిగ్రీ కొని, చైనాలో ఉన్నత చదవులు.. నేపాల్ ఎంపీ నిర్వాకం ఇది

వార్తా సంస్థ పీటీఐ ప్రకారం.. పోరాడుతున్న రెండు వర్గాల మధ్య బఫర్ జోన్ సృష్టించడానికి అస్సాం రైఫిల్స్ సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెడుతున్నారని కుకీ శాసనసభ్యులు లేఖలో పేర్కొన్నారు. భారతదేశపు అతిపురాతనమైన పారామిలిటరీ దళమైన అస్సాం రైఫిల్స్ ఆవిర్భవించినప్పటి నుంచి దేశ అంతర్గత, బాహ్య రక్షణకు సహకరిస్తున్నదని ప్రధానికి ఇచ్చిన ఒక మెమోరాండంలో కుకీ శాసనసభ్యులు తెలిపారు. ప్రస్తుతం మణిపూర్‌లో పరిస్థితిని నియంత్రించేందుకు అస్సాం రైఫిల్స్ బీఎస్ఎఫ్, ఐటీబీపీ, ఆర్ఏఎఫ్, సీఆర్‭పీఎఫ్ మొదలైన ఇతర కేంద్ర బలగాలతో సంయుక్తంగా కృషి చేస్తున్నాయని గిరిజన శాసనసభ్యులు తెలిపారు.