Guinness Record: 500 కిలోల పిండి, 26,000 గుడ్లు, 2,000 లీటర్ల పాలతో 4.5 కిలోమీటర్ల బ్రెడ్ తయారీ

ప్రపంచంలోనే అతి పొడవైన బ్రెడ్ ను తయారు చేసి ఓ విశ్వవిద్యాలయ విద్యార్థులు గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. ఆ 14,360 బ్రెడ్ ముక్కల మొత్తం పొడవు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో ఉండే యూనివర్సిడాడ్ విజ్యాడా మెక్సాకాలీ విద్యార్థులు ఈ రికార్డు అందుకున్నారు.

Guinness Record: 500 కిలోల పిండి, 26,000 గుడ్లు, 2,000 లీటర్ల పాలతో 4.5 కిలోమీటర్ల బ్రెడ్ తయారీ

Guinness Record

Guinness Record: ప్రపంచంలోనే అతి పొడవైన బ్రెడ్ ను తయారు చేసి ఓ విశ్వవిద్యాలయ విద్యార్థులు గిన్నిస్ రికార్డును బద్దలు కొట్టారు. ఆ 14,360 బ్రెడ్ ముక్కల మొత్తం పొడవు 4.5 కిలోమీటర్లు ఉంటుంది. మెక్సికోలోని బాజా కాలిఫోర్నియాలో ఉండే యూనివర్సిడాడ్ విజ్యాడా మెక్సాకాలీ విద్యార్థులు ఈ రికార్డు అందుకున్నారు.

జనవరి 6న జరుపుకునే ‘త్రీ కింగ్స్ డే’ సందర్భంగా ఈ సంప్రదాయ రోస్కా డి రెయెస్ బ్రెడ్ ను విద్యార్థులు తయారు చేశారు. ఇందుకు సంబంధించిన వివరాలు, ఫొటోలను యూనివర్సిడాడ్ విజ్యాడా మెక్సాకాలీ తమ ఫేస్ బుక్ ఖాతాలో పోస్ట్ చేసింది. ఈ బ్రెడ్ ను రూపొందించడానికి 700 మంది విద్యార్థులు 96 గంటల పాటు శ్రమించారు.

ఇందుకోసం 500 కిలోల పిండి 26,000 కోడి గుడ్లు, 2,000 లీటర్ల పాలు, ఇతర పదార్థాలను వినియోగించారు. ఆహార కేటగిరీలో ఇప్పటికే మెక్సికో పలు రికార్డులను బద్దలు కొట్టింది. ఇప్పుడు ఆ జాబితాలో ఈ బ్రెడ్ కూడా వచ్చి చేరింది. మెక్సికోలోని విద్యార్థులే కాకుండా రెస్టారెంట్లు హోటళ్లు గిన్నిస్ రికార్డుల కోసం ప్రయత్నిస్తూ ఉంటాయి.

Rahul Gandhi’s Kaurava dig: పాండవుల్లో 50 ఏళ్ల వయసులో తమ చెల్లికి ముద్దు పెట్టిన వారు ఎవరు?: రాహుల్‌కి యూపీ మంత్రి ప్రశ్న