Anurag Thakur : ప్రధాని పర్యటనలో భద్రతా లోపం..కఠిన నిర్ణయాలకి సిద్ధమైన హోంశాఖ!

ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ పెద్ద,కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను

Anurag Thakur : ప్రధాని పర్యటనలో భద్రతా లోపం..కఠిన నిర్ణయాలకి సిద్ధమైన హోంశాఖ!

Anurag Takur

Modi’s Punjab Visit :  ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యాలపై కేంద్ర హోంశాఖ పెద్ద,కఠిన నిర్ణయాలు తీసుకునే అవకాశముందని కేంద్రమంత్రి అనురాగ్ ఠాకూర్ గురువారం తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలను కేంద్ర హోంశాఖ సేకరిస్తోందని,దాని ఆధారంగా తదుపరి చర్యలు ఉంటాయని అనురాగ్ ఠాకూర్ చెప్పారు.

ఈ విషయంపై కొంతమంది ఇప్పటికే సుప్రీంకోర్టును ఆశ్రయించారని అనురాగ్ ఠాకూర్ తె లిపారు. దేశ న్యాయవ్యవస్థ అందరికీ న్యాయం చేస్తుందని నమ్ముతున్నట్లు చెప్పారు. గురువారం కేబినెట్ సమావేశం అనంతరం మీడియాతో మాట్లాడిన అనురాగ్ ఠాకూర్ ఈ వ్యాఖ్యలు చేశారు.

కాగా,మోదీ పంజాబ్​ పర్యటనలో భద్రతా తప్పిదాలపై ఇవాళ కేంద్ర కేబినెట్ భేటీలో చర్చ జరిగినట్లు సమాచారం. ఈ ఘటనను మంత్రులంతా తీవ్రంగా ఖండించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి. మోదీ అధ్యక్షతన భేటీ అయిన కేంద్ర కేబినెట్​లో.. కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మంత్రులు మాట్లాడారని అధికార వర్గాలు తెలిపాయి. ఈ వ్యవహారంపై పంజాబ్ ప్రభుత్వం తీరును తప్పుబట్టారని తెలిపాయి. ప్రధాని భద్రత ఇలా ఉల్లంఘనకు గురికావడం గతంలో ఎప్పుడూ చూడలేదని మంత్రులు అన్నారని, సరైన చర్యలు తీసుకుంటేనే ఇలాంటివి మరోసారి జరగవని అభిప్రాయపడ్డారని ఓ మంత్రి చెప్పారు. దీనిపై ఉన్నతస్థాయి చర్చ జరిగిందని అన్నారు.

ALSO READ Rashmi Thackeray : ఉద్దవ్ భార్యపై ట్వీట్..బీజేపీ ఐటీ సెల్ సభ్యుడు అరెస్ట్