Minister Harish Rao: కాంగ్రెస్, బీజేపీ చీఫ్ ట్రిక్స్ చేస్తున్నాయి.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం..

తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలకు గులాంలు.. బీజేపీ నేతలు గుజరాత్‌కు గులాంలు. కానీ, బీఆర్ఎస్ పార్టీకి ప్రజలే హై కమాండ్ అని మంత్రి హరీష్ రావు అన్నారు.

Minister Harish Rao: కాంగ్రెస్, బీజేపీ చీఫ్ ట్రిక్స్ చేస్తున్నాయి.. బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం..

Harish Rao

Minister Harish Rao: తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వస్తాం అనేది ఎండమావి, మళ్లీ బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయం అని మంత్రి తన్నీరు హరీష్ రావు అన్నారు. ఖమ్మం జిల్లా పర్యటనలో భాగంగా సత్తుపల్లి నియోజకవర్గం కల్లూరులో పలు అభివృద్ధి పనులకు మంత్రి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఆదివారం చేవెళ్లలో జరిగిన సభలో అమిత్ షా చేసిన వ్యాఖ్యలకు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. చేవెళ్ళ మీటింగ్‌కి కల్లూరు సభలో ఉన్నంత కార్యకర్తలు లేరని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావటం జరగదని, ఖమ్మం జిల్లాలో ఆ పార్టీకి డిపాజిట్లు కూడా రావని అన్నారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీల నేతలు అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. మనం ఎప్పటికప్పుడు నిజాన్ని ప్రచారంలో పెట్టకపోతే అబద్దం వాస్తవం‌గా చేస్తారంటూ విమర్శించారు.

రైతులను ఆదుకుంటాం ..

తెలంగాణ‌లో ప్రభుత్వం కొత్తలో 14 లక్ష ల ఎకరాలు సాగు చేస్తే ఇప్పుడు 54లక్షల ఎకరాలు సాగు అయిందని హరీష్ రావు చెప్పారు. తెలంగాణ ప్రజలకు కేసీఆర్ లాంటి అద్బుతమైన దీపం ఉంది. దేశంలో ఎన్ని వడ్లు కొంటే తెలంగాణ‌లో అంతకంటే ఎక్కువ వడ్లు పండుతున్నాయి. కరువు అనే పదాన్ని డిక్షనరీ నుండి తొలిగించి న వ్యక్తి కేసీఆర్ అని అన్నారు. రైతులు ఆందోళన చెందవద్దు, ప్రతి గింజను ప్రభుత్వం కొంటదని హరీష్ రావు రైతులకు భరోసా ఇచ్చారు. ఆకాల వర్షం‌తో నష్టపోయిన రైతులు‌ను ఆదుకుంటామని అన్నారు. భూముల ధరలు పెరిగాయి. అయిల్ ఫామ్‌ని విస్తరించే కార్యక్రమం చేస్తున్నాని మంత్రి చెప్పారు.

అమిత్ షా ప్రసంగంపై విమర్శలు..

కర్ణాటక‌లో ఓటమి తప్పదు అనే ప్రస్టేషన్‍‌లో మాట్లాడారు అంటూ చెవెళ్ల సభలో అమిత్ షా వ్యాఖ్యలకు హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. కులాలు, మతాల మధ్య చిచ్చు పెట్టేలా మాట్లాడారు. చేవెళ్ళ‌లో ఐటిఆర్‌ని రాకుండా చేశావు. మీకు మాట్లాడే హక్కు ఎక్కడది? అని ప్రశ్నించారు. పేపరు లీకేజ్ వ్యక్తి‌ని పక్కన పెట్టుకుని మాట్లాడటం హాస్యాస్పదంగా ఉంది అంటూ అమిత్ షాపై మంత్రి మండిపడ్డారు.

కాంగ్రెస్‌పై విమర్శలు..

కాంగ్రెస్ కొత్త ముస్కు వేసుకుని వస్తున్నారు. ఎరువులు పంపిణీ చేయటం చేతకానీ కాంగ్రెసోళ్లు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ప్రశ్నించారు. కాంగ్రెస్ అంటే లంచాలు, అవినీతి గుర్తుకు వస్తాయి. తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఢిల్లీ పెద్దలకు గులాంలు.. బీజేపీ నేతలు గుజరాత్‌కు గులాంలు. కానీ, బీఆర్ఎస్ పార్టీకి మాత్రం ప్రజలే హై కమాండ్ అని హరీష్ అన్నారు. భట్టి విక్రమార్క డిప్యూటీ స్పీకర్‌గా ఉండి వంద పడకలు ఆసుపత్రి కూడా తెచ్చుకో లేదంటూ విమర్శించారు.

సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలి..

ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రచారం చేయాలని నాయకులు, కార్యకర్తలకు హరీష్ రావు సూచించారు. కంటి వెలుగులో రెండు కోట్ల మందికి చికిత్స అందించాం. ఇలాంటి కార్యక్రమాలు ఎక్కువయ్యాయి.. కానీ, ప్రచారం తక్కవైంది. ప్రచారం చేయాలని అన్నారు. మహారాష్ట్ర షోలాపూర్‌లో నాలుగు రోజులకోసారి నీళ్ళు వస్తాయి. మన తెలంగాణలో ప్రతిఊర్లో 24 గంటలు వస్తాయి. డబుల్ ఇంజన్ ప్రభుత్వం‌పై చర్చ పెట్టాలి. కాంగ్రెస్, బీజేపీ చీఫ్ ట్రిక్స్ చేస్తున్నాయి. వాటిని ఎప్పటికప్పుడు క్షేత్ర స్థాయిలో తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు హరీష్ రావు పిలుపునిచ్చారు. ఖమ్మం జిల్లాలో మెడికల్ కాలేజ్, నర్సింగ్ కాలేజ్‌లో తరగతులు ప్రారంభం అవుతాయి. సీతారామ ప్రాజెక్టు ద్వారా గోదావరి నీళ్లతో సత్తుపల్లి ప్రజల కాళ్ళు కడుగుతాం. కాలం అయినా కాకపోయినా గోదావరి జలాలతో రెండు పంటలు పండుతాయని అన్నారు.