Telangana Assembly : ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింది..గ్రామీణాభివృద్ధిపై చర్చకు సిద్ధమా ?

కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిదని, విమర్శలకు తావు లేకుండా పరిపాలన కొనసాగుతోందన్నారు. ఉమ్మడి ఏపీ

Telangana Assembly : ప్రతిపక్షాలకు పని లేకుండా పోయింది..గ్రామీణాభివృద్ధిపై చర్చకు సిద్ధమా ?

minister Harish Rao

Minister Harish Rao : 60 ఏళ్లలో కాంగ్రెస్ చేయలేని పని సీఎం కేసీఆర్ చేసి చూపించారు.. ఉద్యోగ ప్రకటనతో కాంగ్రెస్, బీజేపీలో వణుకు మొదలైందని విమర్శించారు మంత్రి హరీష్ రావు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక ప్రతిపక్షాలకు పని లేకుండా పోయిదని, విమర్శలకు తావు లేకుండా పరిపాలన కొనసాగుతోందన్నారు. ఉమ్మడి ఏపీ శాసనసభలో కరవు, ఎండిపోయిన పంటల పొలాలపై ప్రధానంగా చర్చ జరిగేదని, గవర్నర్ ప్రసంగంలో కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తూ..ప్రతిపక్షాలు ప్ల కార్డుల ప్రదర్శన చేసేవారన్నారు గుర్తు చేశారు. 2022, మార్చి 09వ తేదీ బుధవారం తెలంగాణ అసెంబ్లీ సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ నేత భట్టి విక్రమార్క చేసిన విమర్శలను కొట్టిపారేశారు.

Read More : Telangana Assembly : K- కొత్త C- చరిత్ర R – రాయడం.. కేసీఆర్ అంటే.. K- కొలువులు C-చదువులు R- రిజర్వేషన్లు.

ఎండిపోయిన పంటలు, కరెంటు కోతలపై.. ఇతరత్రా అంశాలపై ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయా అని ప్రశ్నించారు. ఏం జరగలేదని భట్టి విక్రమార్క చెప్పడం హాస్యాస్పదమన్నారు పల్లెలు పచ్చగా అయిపోయాయని, పట్టణ ప్రగతి కార్యక్రమాన్ని కూడా తీసుకున్నామన్నారు. మధిర నియోజకవర్గంలో రూ. 400 కోట్లతో వెజ్ – నాన్ వెజ్ మార్కెట్ ను మున్సిపాల్టీలో కోటి రూపాయలతో వైకుంఠధామం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ప్రతిపక్ష పార్టీలకు చెందిన నియోజకవర్గాల్లో అభివృద్ధి చేశామన్నారు. గ్రామీణాభివృద్ధిపై చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎన్నికలు అయిపోయిన తర్వాత.. మిషన్ భగీరథను ముందుకు తీసుకొచ్చి.. మంచినీటి సమస్య లేకుండా చేసిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.

Read More : Telangana CM : కేసీఆర్‍‍కు యూత్‌‌లో ఫుల్ క్రేజ్ వస్తుంది.. ఏపీలో డబ్బే లేదు

తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల విషయంలో టీఆర్ఎస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఏకంగా 91 వేల 142 ఉద్యోగాలను పోస్టులను భర్తీ చేయనుంది. అంతేగాకుడా 11 వేల 103 కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసింది. ఈ మేరకు అసెంబ్లీ సాక్షిగా సీఎం కేసీఆర్ ఈ కీలక ప్రకటన చేశారు. దీంతో నిరుద్యోగులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సంబరాలు చేసుకుంటున్నారు. కేసీఆర్ ఫొటోలు, కటౌట్ లకు పాలాభిషేకం చేస్తున్నారు. ఉద్యోగాలు భర్తీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల కృతజ్ఞతలు తెలియచేస్తున్నారు. తెలంగాణ భవన్ లో సంబరాలు మిన్నంటాయి. సీట్లు పంచుకుని.. సంబరాలు చేసుకున్నారు. ప్రతిష్టాత్మకమైన ఓయూలో విద్యార్థులు సంబరాలు చేసుకున్నారు. స్వీట్లు పంచుకుని ఓయూ జేఏసీ సంబరాలు జరుపుకున్నారు.