Telangana Assembly : K- కొత్త C- చరిత్ర R – రాయడం.. కేసీఆర్ అంటే.. K- కొలువులు C-చదువులు R- రిజర్వేషన్లు.

బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్న వాళ్లు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ సెటైర్ వేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇక సంపూర్ణమయినట్లు, కాళేశ్వరం నీళ్లతో రైతుల

Telangana Assembly : K- కొత్త C- చరిత్ర R – రాయడం.. కేసీఆర్ అంటే.. K- కొలువులు C-చదువులు R- రిజర్వేషన్లు.

Jeevan Reddy

Telangana Jobs : కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అనే సంగతి తెలిసిందే. అయితే.. ఈ పదానికి పీయూసీ ఛైర్మన్, ఎమ్మెల్యే జీవన్ రెడ్డి కొత్త నిర్వచనం చెప్పారు. K- కొత్త C- చరిత్ర R – రాయడం.. కేసీఆర్ అంటే.. K- కొలువులు C- చదువులు R – రిజర్వేషన్లు అని అభివర్ణించారు. తెలంగాణ రాష్ట్రంలో ఉద్యోగాల భర్తీ విషయంలో సీఎం కేసీఆర్ సంచలన నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. 2022, మార్చి 09వ తేదీ బుధవారం అసెంబ్లీ సాక్షిగా..ప్రకటన చేశారు. రాష్ట్రంలో 91, 142 ఉద్యోగాల పోస్టులు ఖాళీగా ఉన్నాయని.. ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు. అలాగే 11,103 కాంట్రాక్ట్ ఉద్యోగులకు రెగ్యులరైజ్ చేస్తున్నామని చెప్పారు. కాంట్రాక్టు వ్యవస్థను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద ఎమ్మెల్యే జీవన్ రెడ్డి మాట్లాడుతూ…

Read More : Telangana CM : కేసీఆర్‍‍కు యూత్‌‌లో ఫుల్ క్రేజ్ వస్తుంది.. ఏపీలో డబ్బే లేదు

బీజేపీ, కాంగ్రెస్ లో ఉన్న వాళ్లు కూడా ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చంటూ సెటైర్ వేశారు. నీళ్లు, నిధులు, నియామకాలు ఇక సంపూర్ణమయినట్లు, కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్ళు కడిగినం.. నిధులతో ఈ బడ్జెట్ లో భారీ నిధులు కేటాయించారని తెలిపారు. నీళ్లు నిధులు తీసుకొచ్చి, నియామకాలు ఇచ్చారు.. బండి సంజయ్ టపకాయలు పేల్చే సమయం వచ్చిందన్నారు.

Read More : Telangana Jobs : తెలంగాణ వ్యాప్తంగా సంబరాలు.. నిరుద్యోగులు ఫుల్ ఖుష్

మన ఊరు – మనబడితో విద్యనందించడం జరుగుతోందని, ఒక దుర్దినంగా ప్రతిపక్షాలు భావిస్తున్నారని విమర్శించారు. వాళ్లకు మాటలు రాకుండా సీఎం కేసీఆర్ చేసినట్లు, మొత్తం నియామకాలు భర్తీ చేయాబోతున్నమనే విషయాన్ని ఆయన వెల్లడించారు. నిరుద్యోగులు బీజేపీ ట్రాప్ లో పడవద్దని, చక్కగా చదువుకోవాలని విద్యార్థులకు, నిరుద్యోగులకు ఆయన సూచించారు. తన నియోజకవర్గంలో ఉన్న నిరుద్యోగులకు సొంత ఖర్చులతో కోచింగ్ సెంటర్లు పెడుతానని, అందరు చదువుకోవాలని ఎమ్మెల్యే జీవన్ రెడ్డి సూచించారు.