Telangana : తెలంగాణ దేశానికే దిశనిర్ధేశం చూపుతోంది : మంత్రి హరీశ్ రావు

టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని దేశానికి తెలంగాణ దిశానిర్ధేశం చూపుతోంది అని మంత్రి హరీశ్ రావు అన్నారు.

Telangana : తెలంగాణ దేశానికే దిశనిర్ధేశం చూపుతోంది : మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao

Updated On : April 27, 2022 / 11:45 AM IST

Telangana : టీఆర్ఎస్ పార్టీ 21వ ఆవిర్భావ వేడుకల సందర్భంగా గులాబీ నేతలంతో సంబురాల్లో మునిగిపోయారు. గుండెల నిండా పార్టీ అభిమానాన్ని నింపుకుని సభకు తరలివస్తున్నారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు మాట్లాడుతూ..టీఆర్ఎస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం దేశానికే ఆదర్శంగా నిలిచింది అని దేశానికి తెలంగాణ దిశానిర్ధేశం చూపుతోంది అని అన్నారు.

Also read : TRS 21st Plenary : టీఆర్ఎస్ 21వ ప్లీనరీలో ఆమోదం తెలుపనున్న తీర్మానాలు…

రైతు బంధు పథకం కేంద్రానికి..ఇతర రాష్ట్రాలకు ఆదర్శనంగా నిలిచింది అన్నారు. అలాగే నీటి సమస్యను తీర్చే మిషన్ భగీరథ పథకం భారత్ లో అన్ని రాష్ట్రాలకు రోల్ మోడల్ గా నిలిచిందన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలంగాణకు ఎంతోమంది ఉద్యోగాలు, ఉపాధి కోసం తరలివస్తున్నారని అన్నారు. ఇక టీఆర్ఎస్ పాలనను విమర్శించే బీజేపీది కేవలం మేకపోతు గాంభీర్యమేనంటూ ఎద్దేవా చేశారు.

టీఆర్ఎస్ 21వ ప్లీనరీ సందర్భంగా హరీశ్ రావు ఎంతో సంతోషాన్ని వ్యక్తం చేస్తు అభిమానులందరికి ట్విట్టర్ లో తన సంతోషాన్ని పంచుకున్నారు. నేతలు, కార్యకర్తలు ఎంతో సంతోషంగా ఉన్నారని..అన్నారు.తెలంగాణ ప్రజల గుండెల నిండా.. గులాబీ జెండా రెపరెపలాడుతుందని మంత్రి హరీశ్‌ రావు ట్విట్టర్ లో పేర్కొన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలకు మంత్రి హరీశ్‌ రావు టీఆర్‌ఎస్‌ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.

Also read : Telangana : నిజం చెప్పకూడదు అనే శాపం కేసీఆర్ కు ఉందేమో : బండి సంజయ్

తెలంగాణ ప్రజల గుండెల నిండా… గులాబీ జెండా ఉందని.. 2001లో తెలంగాణ ప్రజల ఆశలు, ఆకాంక్షల్లోంచి సీఎం కేసీఆర్ నాయకత్వంలో పార్టీ ఆవిర్భవించిందన్నారు. రాష్ట్రం కోసం కొట్లాడి, స్వరాష్ట్రంలో‌ సబ్బండ వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తున్నది వెల్లడించారు. కోట్లాది ప్రజల మద్దతు, కార్యకర్తల బలంతో టీఆర్ఎస్ సగర్వంగా 21వ వసంతంలోకి అడుగుపెట్టిందని ట్వీట్‌ చేశారు. పార్టీ ఏర్పాటు సందర్భంగా కేసీఆర్‌తో తాను ఉన్న ఫొటోలను షేర్‌ చేశారు.