Minister KTR: బెంగళూరు, చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉంది

సెమీకండక్టర్ డిజైన్, డెవలప్‌మెంట్ ఫెసిలిటీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోంది చెప్పారు.

Minister KTR:  బెంగళూరు, చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉంది

Minister KTR

Updated On : July 3, 2023 / 12:09 PM IST

Semiconductor Design Development Facility: హైదరాబాద్‌ కోకాపేట్‌లోని వన్ గోల్డెన్ మైల్‌లో మైక్రోచిప్ టెక్నాలజీ ఇండియా సెమీకండక్టర్ డిజైన్, డెవలప్‌మెంట్ ఫెసిలిటీని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నాస్కోమ్ లెక్కల ప్రకారం దేశంలో సెమీకండక్టర్ రంగంలో 1/3 ఉద్యోగాలు హైదరాబాదు నుంచే ఉన్నాయని అన్నారు. బెంగళూరు, చెన్నైల కన్నా హైదరాబాద్ ముందంజలో ఉందని తెలిపారు. దేశానికి లైఫ్ సైన్సెస్ కాపిటల్‌గా హైదరాబాద్ ఉందని చెప్పారు. భారత్‌లో అతిపెద్గ మెడికల్ డివైజ్ పార్క్ కూడా హైదరాబాద్‌లోనే ఉందని, హైదరాబాద్‌ను పోల్ పొసిషన్ తీసుకొచ్చేందుకు మెుబిలిటీ వ్యాలీ‌ను‌కూడా తీసుకొచ్చామని కేటీఆర్ అన్నారు.

Minister KTR-Rahul Gandhi : రాహుల్ గాంధీపై కేటీఆర్ వరుస కౌంటర్లు.. అవినీతికి, అసమర్ధతకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్

భారత్‌లో వ్యాక్సిన్ ఉత్పత్తికి జీనోమ్ వ్యాలీ హెడ్ క్వార్టర్స్ టాస్క్ ద్వారా విద్యార్థులకు స్కిల్ ట్రైనింగ్ ఇస్తున్నామని తెలిపారు. హైదరాబాద్ ప్రపంచంలోనే అతిపెద్ద ఇన్నోవేషన్ క్యాంపస్ అని పేర్కొన్న కేటీఆర్.. సెమీ కండక్టర్ రంగంలో హైదరాబాద్ నగరం అద్భుతంగా ముందుకెళ్తోందని చెప్పారు. దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి వచ్చిన యువత వల్ల నగరం అభివృద్ధి బాటలో నడుస్తోంది చెప్పారు.