Minister KTR-Rahul Gandhi : రాహుల్ గాంధీపై కేటీఆర్ వరుస కౌంటర్లు.. అవినీతికి, అసమర్ధతకు కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్
స్కాములతో దేశాన్ని భ్ర ష్టు పట్టించారని ఆ స్కాములే త్రాచుపాములై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను మింగేశాయని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్ కు సి టీమ్ అంతకన్నా కాదు..మా బీజేపీకి, కాంగ్రెస్ లను ఒంటిచేత్తో ఢీకొట్టే పార్టీ అంటూ సమాధానమిచ్చారు.

Minister KTR ..Rahul gandhi
KTR counters on Rahul Gandhi : తెలంగాణ పర్యటనలో రాహుల్ గాంధీ ఖమ్మంలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో చేసిన వ్యాఖ్యలకు మంత్రి కేటీఆర్ వరుస కౌంటర్లతో విరుచుకపడ్డారు.బీజేపీ, బీఆర్ఎస్ రెండు ఒక్కటేనని బీజేపీకి బీఆర్ఎస్ బీ టీమ్ అంటూ రాహుల్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ మండిపడ్డారు. మాపార్టీ బీ టీమ్ కాదు..కాంగ్రెస్, బీజేపీలను ఢీకొట్టే పార్టీ అంటూ ధీటుగా సమాధానమిచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ బీటీమ్ అంటే బీజేపీ బంధువుల పార్టీ అంటూ రాహుల్ విమర్శలకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా స్పందిస్తు మాది బీజేపీ బంధువుల పార్టీ కాదు మీదే భారత రాబంధుల పార్టీ అంటూ ఘాటు సమాధానమిచ్చారు. ఏఐసీసీ అంటేనే అఖి భారత కరప్షన్ కమిటీ అంటూ ఎధ్దేవా చేశారు.
దేశంలో అవినీతికి, అసమర్ధతకు ఒకే ఒక్క కేరాఫ్ అడ్రస్ కాంగ్రెస్ పార్టీ అంటూ విమర్శించారు. స్కాములతో దేశాన్ని భ్ర ష్టు పట్టించారని ఆ స్కాములే త్రాచుపాములై దేశ వ్యాప్తంగా కాంగ్రెస్ ను మింగేశాయని కౌంటర్ ఇచ్చారు. బీఆర్ఎస్ బీజేపీకి బీ టీమ్ కాదు కాంగ్రెస్ కు సి టీమ్ అంతకన్నా కాదు..మా బీజేపీకి, కాంగ్రెస్ లను ఒంటిచేత్తో ఢీకొట్టే పార్టీ అంటూ సమాధానమిచ్చారు.
కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటున్న కాంగ్రెస్ అర్థం పర్థంలేని విమర్శలు చేస్తోందంటూ విరుచుకుపడ్డారు. రూ. లక్ష కోట్లు ఖర్చుకాని కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతా? అని ప్రశ్నించారు. అర్థం పర్థం లేని ఆరోపణలు చేసి ప్రజాక్షేత్రంలో ఎన్నిసార్లు నవ్వులపాలు అవుతారు? అంటూ ప్రశ్నించారు. తెలంగాణ ప్రజలు కోరుతోంది నిర్మాణాత్మక ప్రతిపక్షం..ప్రాజెక్టు నిర్మాణ వ్యయం కూడా తెలియని ప్రతిపక్షం కాదు అంటూ కేటీఆర్ ఎద్దేవా చేశారు.
ఖమ్మంలో సభలో రాహుల్ గాంధీ ..తెలంగాణలో వృద్ధులు, వితంతువులకు రూ.4,000 పింఛను ప్రకటిస్తున్నా అని తెలిపారు. దీనిపై కూడా కేటీఆర్ కౌంటర్ ఇస్తు..కర్ణాటకలో అన్న భాగ్య హామీని గంగలో కలిపి అక్కడ 4వేల పెన్షన్ అంటే నమ్మేదెవరు అని ఎన్నికల్లో హామీ ఇచ్చిన రేషన్ ఇశ్వలేనోళ్లు…ఇక్కడికొచ్చి డిక్లరేషన అంటే విశ్వసించేదెవరు? అని ప్రశ్నించారు.
కర్ణాటకలో గెలిచినట్లే తెలంగాణాలో కూడా కాంగ్రెస్ విజయం తథ్యం అంటూ కాంగ్రెస్ నేతలు కలలు కంటున్నారు అంటూ ఎద్దేవా చేశారు. కర్ణాటకలో బీజేపీని ఓడించింది అక్కడ ప్రజలు తప్ప ముమ్మాటికి కాంగ్రెస్ కాదన్నారు. మరో ప్రత్యామ్నాయం లేకే కన్నడ ప్రజలు కాంగ్రెస్ ను గెలిపించారన్నారు. అది మీ సమర్థత అంతకంటే కాదన్నారు. సమ్మక్క జాతరను తలపించేలా పండుగల సాగుతున్న పోడు భూముల పంపణి రాహుల్ గాంధీకి కనిపించటలేదా?అని ప్రశ్నించారు.కనిపించకపోతే మా ప్రభుత్వం అమలు చేస్తునన కంటి వెలుగు కింద పరీక్షలు చేయించుకోండి అంటూ ఎద్దేవా చేశారు. ఇలా రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కేటీఆర్ ట్విట్టర్ వేదికగా కౌంటర్లతో విరుచుకుపడ్డారు మంత్రి కేటీఆర్.