Minister KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

భారత దేశంలో ఎక్కడా ఇటువంటి డబుల్ బెడ్రూం ఇల్లు లేవన్నారు. విమర్శలు చేస్తున్నవారిని అడుగుతున్నా.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి అభివృద్ధి పనులు జరిగాయా అని ప్రశ్నించారు.

Minister KTR : రాజన్న సిరిసిల్ల జిల్లాలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను ప్రారంభించిన మంత్రి కేటీఆర్

Ktr

double bedroom houses : రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డి పేట మండలంలోని వెంకటాపుర్ లో శనివారం (మార్చి 5,2022)వ తేదీన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. 40 మంది లబ్ధిదారులకు డబుల్ బెడ్ రూమ్ లు పంపిణీ చేసి, లబ్ధిదారులతో గృహప్రవేశం చేయించారు. ఆత్మగౌరవ గృహ సముదాయ ప్రారంభోత్సవ సమావేశంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ డబుల్ బెడ్రూం ఇళ్ళను పారదర్శకంగా ఇచ్చిన అధికారులకు ధన్యవాదాలు తెలిపారు.

గ్రామంలో మరో 40 మంది ఇల్లు లేని వారిని గుర్తించి పట్టాలు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. సొంత ఇంటి స్థలం ఉన్నవారికి డబుల్ బెడ్రూం ఇల్లు కట్టించి పెడతామని తెలిపారు. అన్ని సంఘాల భవనాలు త్వరలోనే పూర్తి అవుతాయని, కొన్నింటిని ఇప్పటికే మంజూరు చేశామని, మరికొన్ని పూర్తి అవుతున్నాయని వెల్లడించారు. గ్రామాలలో రూ.20 లక్షలతో కేసీఆర్ భవనాలు పూర్తయ్యాయని చెప్పారు.

Double Bedroom House : ఒక్కో డబుల్ బెడ్‌రూం విలువ కోటిన్నర : కేటీఆర్‌

ఒక ఊరికి తెలంగాణ రాకముందు రూ.50 లక్షలు రావడమే కష్టంగా ఉండేది..కానీ ఇప్పుడు 5 కోట్లు పైనే నిధులు అందుతున్నాయని తెలిపారు. భారత దేశంలో ఎక్కడా ఇటువంటి డబుల్ బెడ్రూం ఇల్లు లేవన్నారు. విమర్శలు చేస్తున్నవారిని అడుగుతున్నా.. దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ఇలాంటి అభివృద్ధి పనులు జరిగాయా అని ప్రశ్నించారు. తమపై విమర్శలు చేసేటోళ్లు గతంలో ఏమి చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.

‘నేను రాను బిడ్డో దవాఖానకు’ అని పాడుకున్న అడబిడ్డలు నేడు హాస్పిటల్స్ లో అత్యున్నత వైద్యంతో పాటు కేసీఆర్ కిట్ అందుకుంటున్నారని గుర్తు చేశారు. సిరిసిల్ల రూపురేఖలు మార్చిన ఘనత కేసీఆర్ కే దక్కుతుందన్నారు. రాష్ట్రంలో గూడు లేని పేదలకు గూడు కల్పిస్తున్న నేత కేసీఆర్ అని కొనియాడారు.