President Election 2022: ప్రెసిడెన్షియల్ ఎన్నిక ప్రక్రియ.. ఎంపీలు, ఎమ్మెల్యేల పాత్ర ఏంటి?

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్థానాల్లో కొత్త వ్యక్తులు రానున్నారు. జూలై 18న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జూలై 21వ తేదీన నిర్వహిస్తారు. ఈ ఫలితాల ఆధారంగానే రాష్ట్రపతి ఎవరో స్పష్టమవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఎలక్టోరల్ కాలేజీ మీద ఆధారపడి జరుగుతుంది.

President Election 2022: ప్రెసిడెన్షియల్ ఎన్నిక ప్రక్రియ.. ఎంపీలు, ఎమ్మెల్యేల పాత్ర ఏంటి?

President

 

President Election 2022: రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ తో పాటు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు స్థానాల్లో కొత్త వ్యక్తులు రానున్నారు. జూలై 18న జరగనున్న ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియను జూలై 21వ తేదీన నిర్వహిస్తారు. ఈ ఫలితాల ఆధారంగానే రాష్ట్రపతి ఎవరో స్పష్టమవుతుంది. ఈ ప్రక్రియ మొత్తం ఎలక్టోరల్ కాలేజీ మీద ఆధారపడి జరుగుతుంది.

ఎలక్టోరల్ కాలేజీ:
పార్లమెంట్, అసెంబ్లీలకు ఎన్నికైన ప్రజా ప్రతినిధులను కలిపి ఎలక్టోరల్ కాలేజ్ అంటారు.
ఓటు హక్కు:
పార్లమెంటులోని లోక్‌సభ, రాజ్యసభల్లోని సభ్యులకు ఓటు వేసే హక్కు ఉంటుంది. అసెంబ్లీ సభ్యుల్లో ఎమ్మెల్సీలకు మాత్రం ఓటు వేసే హక్కు ఉండదు. ఓటు విలువ ఎంపీలకు, ఎమ్మెల్యేలకు ఒకేలా ఉండదు.

ఓటు విలువ:
ఎమ్మెల్యేల సంఖ్యను ఆ రాష్ట్ర జనాభా(1971 జనాభా లెక్కల ప్రకారం)తో లెక్కిస్తారు. వచ్చిన సంఖ్యను 1000తో భాగించాలి. ఆ ఫలితమే ఓటు విలువ.

Read Also: ప్రెసిడెన్షియల్ ఎన్నిక షెడ్యూల్ రిలీజ్ చేసిన ఎలక్షన్ కమిషన్

ఆంధ్రప్రదేశ్ ఓటు విలువ
1971 జనాభా లెక్కల ప్రకారం.. 2కోట్ల 78లక్షల 586మంది జనాభా ఉండగా.. ఏపీ శాసనసభ సీట్ల సంఖ్య 175గా ఉంది.
అలా చూస్తే…
2,78,00,586 ÷ 175 = 158860.491429 ⇒ 158860.491429÷1,000 = 158.86 ⇒ 159 ⇒ 159X175= 27,825

తెలంగాణ ఓటు విలువ
1972 జనాభా లెక్కల ప్రకారం.. కోటి 57లక్షల 2వేల 122మంది జనాభా ఉండగా.. శాసనసభ స్థానాలు 119.

అలా చూస్తే..
1,57,02,122 ÷ 119 = 131950.605042 ⇒ 131950.605042 ÷ 1000 = 131.95 ⇒ 132 ⇒ 132 X 119 = 15,708.

ఎంపీల ఓటు విలువ లెక్కేసేదిలా:
దేశంలోని మొత్తం రాష్ట్రాల ఎమ్మెల్యేల ఓటు విలువను ఎంపీల సంఖ్యతో భాగిస్తే వచ్చేదే ఎంపీల ఓటు విలువ.

2017 రాష్ట్రపతి ఎన్నికల నాటికి దేశంలో 4వేల 120 ఎమ్మెల్యే స్థానాలుండగా వాటి మొత్తం విలువ 5లక్షల 49వేల 495. వాటిని మొత్తం ఎంపీల (543+233) 776తో భాగిస్తే.. విలువ 708.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

Presidential Election

ఆ ప్రకారం చూస్తే..

ధ్రప్రదేశ్ ఎంపీల ఓటు విలువ 53,313
తెలంగాణ ఎంపీల ఓటు విలువ 32,700

ఓట్లు ఎలా లెక్కిస్తారంటే..
ఎక్కువ ఓట్లు సాధించిన అభ్యర్థి గెలిచినట్లు కాదు. నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. దీని కోసం పోలైన వ్యాలిడ్ ఓట్లను 2తో భాగించి ఫలితంగా వచ్చే సంఖ్యకు ఒకటి కలుపుతారు.

నిర్దేశిత కోటా కంటే ఎక్కువ ఓట్లు వచ్చిన వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. నిర్దేశిత అభ్యర్థి కంటే తక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థిని తొలగించి, ఆ అభ్యర్థికి వచ్చిన ఓట్లను మిగతా అభ్యర్థులకు పంచుతారు. ఆ తర్వాత మళ్లీ కౌంటింగ్ చేపట్టి ఒక అభ్యర్థి గెలిచే వరకు లెక్కింపు జరుగుతుంది.