Kadiyam Srihari : రాజయ్యా.. నీ పని అయిపోయిందయ్యా, శిశుపాలుని వధకు టైమొచ్చింది: కడియం శ్రీహరి

సమాజంలో ప్రతి ఒక్కరి పుట్టుకను ప్రశ్నించేలా రాజయ్య మాట్లాడుతున్నారు. తండ్రి అపోహ మాత్రమే అంటూ చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలని కడియం శ్రీహరి డిమాండ్ చేశారు.

Kadiyam Srihari : రాజయ్యా.. నీ పని అయిపోయిందయ్యా, శిశుపాలుని వధకు టైమొచ్చింది: కడియం శ్రీహరి

Kadiyam and Rajaiah

Updated On : July 11, 2023 / 11:25 AM IST

MLC Kadiyam Srihari..MLA Tatikonda Rajaiah : స్టేషన్ ఘన్ పూర్ (station ghanpur) ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య (Tatikonda Rajaiah)..మాజీ మంత్రి, MLC కడియం శ్రీహరి (kadiyam srihari) మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఎన్నికలు సమీపిస్తున్న కొద్దీ వీరి మధ్య మాటలు తీవ్రస్థాయిలో పెరుగుతున్నాయి. తనను పచ్చి అవినీతిపరుడు అంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలపై కడియం మండిపడ్డారు. రాజయ్య తనపై వ్యక్తిగత విమర్శలు చేస్తున్నారని కులం పేరుతో దూషిస్తున్నారని ఫైర్ అయ్యారు. రాజయ్య వ్యవహారాన్ని తాను సీఎం కేసీఆర్ (CM KCR) దృష్టికి తీసుకెళ్లానని.. దానికి ఆయన ‘రాజయ్య పార్టీ లైన్ దాటి వెళ్తున్నాడు సైలెంట్ గా ఉండు అని కేసిఆర్ చెప్పార’ని వెల్లడించారు. దీంతో రాజయ్యను శిశుపాలుడిలా పోల్చారు. శిశుపాలుడు 100 తప్పులు చేసేవరకు వేచి చూసినట్లుగా కేసీఆర్ కూడా వేచి చూస్తున్నారని ఇక శిశిపాలుడి వధకు సమయం వచ్చింది అంటూ కడియం వ్యాఖ్యానించారు. ‘శిశుపాలునిలా 100 తప్పులు చేసేవరకు కేసిఆర్ వేచి చూస్తున్నారు.. అయినా నీవు ఎక్కడా ఆగటంలేదు.. నీ ఇష్టానుసారంగా నన్ను దూషిస్తున్నావు.. నీ గెలుపు కోసం కష్టపడి పనిచేసిన నన్ను దారుణంగా దూషిస్తున్నావు’ అంటూ మండిపడ్డారు.

రాజయ్య తనపై చేసిన ఆరోపణలకు, సవాళ్లకు బదులు ఇవ్వటానికి కడియం శ్రీహరి సోమవారం మీడియా ముందుకొచ్చారు. ‘కారణం ఏంటో తెలీదు కానీ, నాపై వ్యక్తిగతంగా నా తల్లి, బిడ్డపై స్థాయిని మరిచి నీచస్థాయిరి దిగజారి రాజయ్య మాట్లాడుతున్నారు. అతను మాట్లాడిన విషయాలను చూసి, విని బాధపడ్డాను. 2014, 2018 లో రెండుసార్లు పార్టీ నిర్ణయం మేరకు రాజయ్య గెలుపు కోసం కష్టపడి పనిచేశానను. నా అభిమానులకు నచ్చచెప్పి నా సొంత డబ్బులు ఖర్చు పెట్టి రాజయ్య గెలుపు కోసం కృషి చేశాను. అటువంటి నాపై ఇటువంటి వ్యాఖ్యలు చేయటం బాధకలిస్తోంది.

Komatireddy Venkat Reddy : 45 రోజుల్లో తెలంగాణ ప్రభుత్వం రద్దు కాబోతోంది- కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

సొంత పార్టీ ఎమ్మెల్సీ అని చూడకుండా, పార్టీ నియమాలను చూడకుండా నాపై, నా కుటుంబం పై దాడి చేస్తున్నారు.. ఈ వ్యాఖ్యలతో మనస్సు బాధకలిగి ఈ విషయాన్ని కేసిఆర్ దృష్టికి తీసుకెళ్ళాను. కేసీఆర్ హామీ ఇవ్వటంతో నేను సైలెంట్ గా ఉన్నాను. కానీ రాజయ్య మాత్రం మళ్లీ మళ్లీ నాపై దారుణమైన విమర్శలు చేస్తూనే ఉన్నాడు. ప్రజలకు నిజాలు తెలియాలని 4 రోజుల తర్వాత బయటకు వచ్చాను.  వైద్య వృత్తిలో ఉండి, 15 ఏళ్లుగా ఎమ్మెల్యేగా ఉండి సభ్యత నేర్చుకుంటారనుకున్నా. నా కులం గురించి.. నా తల్లి కులం గురించి కూడా సభ్యత లేకుండా వ్యాఖ్యలు చేయటం ఎంత వరకు సమంజసం? సాక్షాత్తు సుప్రీంకోర్టే చెప్పింది పిల్లలకు తండ్రి కులం వస్తుందని. కానీ రాజయ్య మాత్రం అసభ్యంగా నా తల్లి గురించి, నా కులం గురించి వ్యాఖ్యానించారు. తల్లి సత్యం, తండ్రి అపోహ మాత్రమే అంటూ మాట్లాడారు. అదే సూత్రం రాజయ్యకు కూడా వర్తిస్తుంది. బహుశా ఆ విషయం రాజయ్య మర్చిపోయినట్లున్నారు.

సమాజంలో ప్రతి ఒక్కరి పుట్టుకను ప్రశ్నించేలా రాజయ్య మాట్లాడుతున్నారు. తండ్రి అపోహ మాత్రమే అంటూ రాజయ్య చేసిన వ్యాఖ్యలకు బేషరతుగా మహిళా లోకానికి క్షమాపణలు చెప్పాలి. ముక్కు నేలకు రాసి మాతృమూర్తులకు క్షమాపణ చెప్పాలి. ఇదేనా నీ సభ్యత సంస్కారం..? నా తల్లి బీసీ, నా తండ్రి ఎస్సీ, నేను కూడా ఎస్సీనే. తల్లులను అవమానపరిచే ప్రజా ప్రతినిధులను చూడలేదు. 1994 నుండి 2004 వరకు ఎమ్మెల్యేను. 1994కు ముందు రాష్ట్రంలో ఎన్ కౌంటర్లు లేవా? 2004 తర్వాత ఎన్కౌంటర్ లు జరగలేదా..? ఎక్కువ ఎన్ కౌంటర్లు అయింది 2004 తర్వాత.. చర్చల పేరుతో పిలిచి ఆచూకీ కనుక్కుని ఎన్ కౌంటర్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం.. అప్పుడు రాజయ్య కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు. వైఎస్ఆర్ ప్రభుత్వంలో జరిగిన ఎన్ కౌంటర్లకు ఎమ్మెల్యే రాజయ్య బాధ్యత వహిస్తాడా? ఎన్ కౌంటర్ల విషయంలో రాజయ్య చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నా.

MLA Rajaiah : కడియం శ్రీహరి పెద్ద అవినీతి తిమింగలం.. ఎమ్మెల్యే రాజయ్య సంచలన ఆరోపణలు

వేల కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని రాజయ్య నా పై ఆరోపణలు చేశారు. నా ఆస్తుల వివరాలు తెస్తే ఘనపూర్ దళిత బిడ్డలకు రాసిస్తా. దీని కోసం రాజయ్యకు వారం సమయం ఇస్తున్నాను. నాకున్నాయని ఆరోపిస్తున్న ఆస్తుల వివరాలు తీసుకురావాలి. నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఘనపూర్ రిజర్వాయర్, 133 కేవీ సబ్ స్టేషన్, గురుకుల పాఠశాల, పాలి టెక్నిక్ కాలేజ్ తెచ్చాను. ఘనపూర్ నియోజకవర్గంలో ఏదైనా ఒక గ్రామాన్ని ఎంచుకుందాం. ఎవరు ఏం చేశారో మీడియా సమక్షంలో తేల్చుకుందాం రా.

సొడశపల్లి భారీ బహిరంగ సభలో ప్రజల మద్దతు ఎవరికి ఉందనేది అందరికీ తెలిసింది. కేటీఆర్ సైతం ఆశ్చర్యపోయేలా రెస్పాన్స్ వచ్చింది. 10 యేండ్ల కాలంలో దళితులకు స్థలాలు, ఇండ్లు, పథకాలు ఎన్ని ఇచ్చానో ప్రజల ముందుకు తెస్తా. 3 దశాబ్దాల కాలంలో ఏ ఒక్కరి దగ్గరైనా డబ్బులు తీసుకొని పథకాలు, ఉద్యోగాలు ఇచ్చినట్టు నిరూపిస్తే ఘనపూర్ ను వదిలిపెట్టి వెళ్లిపోతా, లేదంటే నువ్వు వెళిపోతావా? స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే పేరు చెప్పాలంటే ప్రజలు సిగ్గుపడే పరిస్థితులు వచ్చాయి.

jupally krishna rao : భట్టి విక్రమార్కతో జూపల్లి భేటీ.. పతనం అంచుకు బీఆర్ఎస్ అంటూ వ్యాఖ్యలు

రాజయ్య దళితులకు బీ ఫార్మ్, దళిత బందు అమ్ముకొలేదా..? కాదని చెప్పగలరా..?. రాజయ్య వల్ల దళితులు ఎంతో నష్టపోతున్నారు. పనులిచ్చి కమిషన్లు, పదవులకు డబ్బులు దండుకున్నాడు. రాజయ్యా.. నీ వల్ల బాధలు పడినవారినందరినీ తీసుకొస్తా. రాజయ్యా.. నా దండమయ్యా.. నీలాంటి పనులు నేను చేయలేను. రాజయ్య చేష్టలను అధిష్టానం గమనిస్తోంది. శిశుపాలునిలా 100 తప్పులు చేసేవరకు కేసిఆర్ వేచి ఉన్నారు.  శిశుపాలుని వధకు సమయం దగ్గర పడింది. రాజయ్య కుటుంబం గురించి నేను మాట్లాడితే ఆత్మహత్యలు చేసుకుంటారు. మనుషులుగా పుడితే సభ్యత, సంస్కారం ఉండాలి. మనుషులకు, పశువులకు తేడా ఉంటుంది. కన్న బిడ్డల్లా చూసుకోవాల్సిన ప్రజా ప్రతినిదులను అడ్డం పెట్టుకొని రాజకీయాలు చేయడం మానుకో. నీకు తల్లి, పిల్లలు ఉన్నారు దిగజారి మాట్లాడడం మానుకో. ఇకనైనా మంచిపనులు చేసి, జాగ్రత్తగా మాట్లాడు రాజయ్య’ అంటూ తాటికొండ రాజయ్యపై కడియం శ్రీహరి విరుచుకుపడ్డారు.

Ponguleti Srinivas Reddy: జగన్‌ను నేను కలవలేదు.. షర్మిల చేరిక విషయంపై క్లారిటీ ఇచ్చిన పొంగులేటి