Most Expensive Fruits: ఒక్క స్ట్రాబెర్రీ రూ.3.2 లక్షలు.. మామిడి పళ్ళు రూ.37.2 లక్షలు!
సహజంగా ఇవి డజను పండ్లు మహా అయితే వందలలోనే ఉంటాయి అనుక బేరమాడినా అమ్మేవాళ్ళు పదో పరకో తగ్గించి అమ్ముకుంటారు. అయితే.. లక్షల విలువ చేసే పండ్లయితే ఇంకేం బేరమాడతాం.. ఇంకేం కొంటాం. లక్షలలో పలికే పండ్లు కూడా ఉంటాయా? అనే అనుమానాలు రావచ్చు కానీ అదే నిజం. ఇప్పుడు ఆ పండ్లు ఏంటో.. వాటి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
Most Expensive Fruits Rs 3 2 Lakh For A Single Strawberry Rs 37 2 Lakh For A Mango
Most Expensive Fruits: పండ్లు ఏవైనా మనిషి ఆరోగ్యానికి మంచివి. అందునా రోజుకో యాపిల్ వంటివి తింటే డాక్టర్ తో పనిలేదు. రోజుకో అరటిపండు తింటే జీర్ణక్రియ మెరుగవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ బాగుంటుంది అని మనం తరచుగా వింటూనే ఉంటాం. కాగా, కొన్ని రకాల పండ్లు మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు దొరకవు. కొన్ని సీజన్లలో కొన్ని ప్రాంతాల్లో మాత్రమే అవి లభిస్తాయి. ఆ సీజన్ లోనే ఆ పండు తినాలి.. ఆ ప్రాంతానికి వెళ్తే మరిచిపోకుండా ఆ పండు తినిరావాలి. పండ్ల వలన ఇన్ని లాభాలు ఉన్నాయి కనుకే మనం తరచుగా పండ్లు కొంటుంటాం. కొంతమందైతే వీటిని కొనడానికి మార్కెట్ కి వెళ్తే ధరలను చూసే బేరమాడి మరీ కొంటుంటారు. సహజంగా ఇవి డజను మహా అయితే వందలలోనే ఉంటాయి అనుక బేరమాడినా అమ్మేవాళ్ళు పదో పరకో తగ్గించి అమ్ముకుంటారు. అయితే.. లక్షల విలువ చేసే పండ్లయితే ఇంకేం బేరమాడతాం.. ఇంకేం కొంటాం. లక్షలలో పలికే పండ్లు కూడా ఉంటాయా? అనే అనుమానాలు రావచ్చు కానీ అదే నిజం. ఇప్పుడు ఆ పండ్లు ఏంటో.. వాటి కథ ఏంటో ఇప్పుడు చూద్దాం.
ఇదిగో… ఇక్కడ మీకు ప్రపంచంలోనే 5 అత్యంత ఖరీదైన పండ్లను చూపిస్తున్నాం. అవి ఎందుకు అంత కాస్ట్ లీ? ఏంటి వాటి ప్రత్యేకత అన్నది తెలుసుకుందాం.

Most Expensive Fruits1
సాధారణంగా మామిడి కాయలంటే చెట్లకు కాస్తాయి. మహా అయితే కిలో రెండొందలో మూడొందలో ఉంటుంది. కానీ ఏకంగా కొన్ని దేశాలలో లభించే మామిడి కాయ మన కరెన్సీలో లెక్కేస్తే రూ.70 వేల నుండి కిలో మామిడి లక్షల వరకు పలుకుతుంది. 2010 సంవత్సరంలో ఆస్ట్రేలియాలో టాప్ ఎండ్ రకానికి చెందిన ఒక 12 మామిడి పండ్ల ట్రే 50,000 డాలర్లకు అమ్ముడైంది. అంటే మన కరెన్సీలో చూస్తే రూ.37,23,127 అన్నమాట. ఆస్ట్రేలియాలో 1998 నుండి మామిడి వేలం నిర్వహించడం ఒక ఆనవాయితీ కాగా బ్రిస్బేన్‌లో జరిగిన ఒక వేలం పాటలో ఈ రికార్డు ధర నమోదైంది. ఇక జపాన్ లోని మియాజాకి ప్రావిన్స్ లో తైయో నో టమాగో (ఎగ్ ఆఫ్ ది సన్) అనే జపాన్ అంతటా విక్రయించబడే మామిడి రకం కిలో కాయలు సుమారు 3-4 లక్షల రూపాయలకు సాధారణంగానే అమ్ముతుంటారు.
డెన్సుకే పుచ్చకాయలు
ధర 6,000 డాలర్లు(రూ.3,27,262)

Most Expensive Fruits2
పుచ్చకాయలో ‘డెన్సుకే’ రకం అనేది చాలా అరుదైన పండు. దీనిని జపాన్‌లోని హక్కైడోలో పండిస్తారు. ఇది పండు మొత్తం నల్లగా ఉంటూ ఇతర స్థానిక రకాలైన పండ్ల కన్నా తియ్యగా ఉంటుంది. ఇది ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్నా జపాన్ లో మాత్రం స్పెషల్ పండు. అందుకే అక్కడ ఈ పండు ఎల్లప్పుడూ అధిక ధరకు అమ్ముతారు. అయితే 2014లో డెన్సుకే పుచ్చకాయ ఒకటి ఆరువేల డాలర్లకు అమ్ముడైంది. అంటే మన ధరలో ఇది రూ.3,27,262 రూపాయలు అనమాట.
యుబారి కింగ్ మెలోన్స్
ధర 29,300 డాలర్లు(రూ.21,81,752)

Most Expensive Fruits3
ఇది ప్రపంచంలో అత్యంత ఖరీదైన పండ్లలో ఒకటి. ఈ పండు కూడా జపాన్ లో పండించబడుతుండగా జపాన్ వెలుపల ఎక్కువగా ఈ పండును ఎగుమతి చేయరు. ఇది ఒకరకంగా పుచ్చకాయను పోలి ఉంటుంది కానీ పుచ్చకాయ కాదు. పసుపు పచ్చ రంగులో గుజ్జు, పండు పైన గుమ్మడి కాయ రంగులో ఉంటుంది. ఈ రకమైన పుచ్చకాయలు సూర్యరశ్మికి దూరంగా గ్రీన్ హౌస్ లో పెంచుతుండగా యుబారి పుచ్చకాయల ధర లక్షల రూపాయల్లోనే ఉంటుంది. 2018లో ఒక జత యుబారి పుచ్చకాయలు 29,300 డాలర్లకు వేలం జరిగింది. అంటే మన కరెన్సీలో రూ.21,81,752.
గిగాంటెల్లా మాగ్జిమ్ స్ట్రాబెర్రీస్
ధర 4,395 డాలర్లు(రూ.2,39,719)

Most Expensive Fruits4
యూకేలోని శాస్త్రవేత్తల బృందం స్ట్రాబెర్రీల యొక్క కొత్త జాతిని రూపొందించగా ఈ జాతికి గిగాంటెల్లా మాగ్జిమ్ అని పేరు పెట్టారు. ఈ కొత్త జాతి పండు సాధారణ స్ట్రాబెర్రీల కంటే కాస్త భిన్నంగా ఉంటాయి. ప్రతి స్ట్రాబెర్రీ పండు టెన్నిస్ బంతి పరిమాణంలో పెద్దదిగా పెరుగుతూ ఒక కొత్త రకం రుచిని కలిగి ఉంటుందట. అందుకే 2017లో జరిగిన ఒక వేలంలో గిగాంటెల్లా మాగ్జిమ్ రకం స్ట్రాబెర్రీ ఒకటి 4,395 డాలర్లు పలికిందట. అంటే సుమారు మన కరెన్సీలో రూ. 2,39,719. ఇవి ఒక డజను కొనాలంటే ఇక ఆస్తులు అమ్ముకోవాల్సిందే.
రూబీ రోమన్ ద్రాక్ష
ధర 14,600 డాలర్లు(రూ.10,87,153)

Most Expensive Fruits5
ఈ పండ్లు కూడా జపాన్ లో కనిపిస్తాయి. సాధారణంగా జపాన్ దేశంలో లభించే రకరకాల ఎర్ర ద్రాక్షల లాగే ఉండే ఈ పండు పింగ్ పాంగ్ బంతిలా పెద్దదిగా ఉంటుంది. ఒక కార్టన్ రూబీ ద్రాక్ష ఏడు లక్షల రూపాయల కంటే ఎక్కువే ఉండే ఈ ద్రాక్షను దాని ఖరీదు కారణంగానే ధనవంతుల ఫలం అంటారు. కాగా 2016లో రూబీ రోమన్ ద్రాక్ష ఒక్క గుత్తి 14,600 డాలర్లకు అమ్ముడై రికార్డు నమోదు చేసింది. అంటే మన కరెన్సీలో రూ.10,87,153 అనమాట. మరి ఇంత ఖరీదు పండ్లు మనం కొనడం, తినడం దేవుడెరుగు కనీసం మనం చూస్తామా అనుకుంటున్నారా? ఇంటర్నెట్ లో తప్ప నిజంగానే మనం కంటితో చూడడం కష్టమేనేమో!
