Rahul Gandhi: రేప‌టి విచార‌ణ‌ను వాయిదా వేయండి: ఈడీని కోరిన రాహుల్

నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన‌ నగదు అక్రమ చలామణీ కేసులో తదుపరి విచారణకు తాను శుక్రవారం హాజరుకాలేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేయాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)కు లేఖ రాశారు.

Rahul Gandhi: రేప‌టి విచార‌ణ‌ను వాయిదా వేయండి: ఈడీని కోరిన రాహుల్

Rahul Gandhi

Rahul Gandhi: నేషనల్ హెరాల్డ్ దినపత్రికకు సంబంధించిన‌ నగదు అక్రమ చలామణీ కేసులో తదుపరి విచారణకు తాను శుక్రవారం హాజరుకాలేనని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. విచార‌ణ‌ను సోమ‌వారానికి వాయిదా వేయాల‌ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ)కు లేఖ రాశారు. న‌గ‌దు అక్ర‌మ చ‌లామ‌ణీ కేసులో ఈడీ ఇప్ప‌టికే రాహుల్ గాంధీని మొత్తం క‌లిపి 28 గంట‌లపాటు విచారించింది. ప్ర‌స్తుతం రాహుల్ త‌ల్లి, కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీకి ఢిల్లీలోని గంగారాం ఆసుప‌త్రిలో చికిత్స అందుతోన్న విష‌యం తెలిసిందే. ఆమె వ‌ద్దే రాహుల్ గాంధీ, ఆయ‌న సోద‌రి ప్రియాంకా గాంధీ ఉన్నారు.

congress: ఎంపీలపై పోలీసులు దాడి చేశారు.. ఆహారం, నీళ్లు ఇవ్వలేదు: ఖర్గే, చిదంబరం

ఈ నేప‌థ్యంలోనే విచార‌ణ‌ను వాయిదా వేయాల‌ని రాహుల్ కోరిన‌ట్లు తెలుస్తోంది. క‌రోనా అనంత‌ర స‌మ‌స్య‌ల‌తో సోనియా గాంధీ బాధ‌ప‌డుతున్నారు. ఆమె కూడా ఈ నెల 23న ఈడీ ముందు విచార‌ణ‌కు హాజ‌రు కావాల్సి ఉంది. కాగా, గాంధీ కుటుంబానికి చెందిన యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం, నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికను నిర్వహిస్తున్న అసోసియేటెడ్ జర్నల్స్ లిమిటెడ్‌లో ఆర్థిక లావాదేవీల గురించి రాహుల్‌ను ఈడీ ప్ర‌శ్నించింది.

congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌స‌భ స్పీక‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

నేషనల్ హెరాల్డ్ వార్తాపత్రికకు చెందిన అన్ని ఆస్తులకు యజమానిగా 2010లో ఏజేఎల్‌ను వైఐఎల్ ఏవిధంగా కొనుగోలు చేసిందనే విషయాన్ని వివరించాల్సిందిగా రాహుల్ గాంధీని కోరిన ఈడీ అధికారులు అడిగారు. అయితే, వైఐఎల్‌కు సంబంధించిన అన్ని నిర్ణయాలు లావాదేవీలను పార్టీ దివంగత నేత మోతీలాల్ వోరా తీసుకున్నారని రాహుల్ గాంధీ ఈడీకి చెప్పినట్లు సమాచారం. తీసుకున్న రుణం గురించి తనకు తెలియదని రాహుల్ ఈడికి తెలిపినట్లు తెలుస్తోంది.