congress: ఎంపీలపై పోలీసులు దాడి చేశారు.. ఆహారం, నీళ్లు ఇవ్వలేదు: ఖర్గే, చిదంబరం

అక్రమ నగదు బదిలీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వ్య‌వ‌హ‌రించిన‌ తీరు స‌రికాదంటూ త‌మ ఎంపీలు నిర‌స‌న తెల‌ప‌గా వారిపై పోలీసులు దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆ పార్టీ ఎంపీలు ఆరోపించారు.

congress: ఎంపీలపై పోలీసులు దాడి చేశారు.. ఆహారం, నీళ్లు ఇవ్వలేదు: ఖర్గే, చిదంబరం

Kharge Chidambaram

congress: అక్రమ నగదు బదిలీ కేసులో కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్ట‌రేట్ (ఈడీ) వ్య‌వ‌హ‌రించిన‌ తీరు స‌రికాదంటూ త‌మ ఎంపీలు నిర‌స‌న తెల‌ప‌గా వారిపై పోలీసులు దురుసుగా వ్య‌వ‌హ‌రించార‌ని ఆ పార్టీ ఎంపీలు ఆరోపించారు. ఈ విష‌యంపై రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య నాయుడుకు ఎంపీలు మ‌ల్లికార్జున ఖ‌ర్గే, చిదంబ‌రం స‌హా ప‌లువురు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ”కాంగ్రెస్ నేత‌ల‌ను అక్ర‌మంగా నిర్బంధించారు. వారిపై ఎలాంటి కేసులూ పెట్టలేదు. వారిపై దాడి జ‌రిగింది.. వారు ఆసుప‌త్రుల‌కు వెళ్లాల్సి వ‌చ్చింది. కొంద‌రి ప‌క్క‌టెముక‌లు విరిగాయి” అని మ‌ల్లికార్జున ఖ‌ర్గే చెప్పారు.

congress: మాపై పోలీసులు దాడి చేశారు: లోక్‌స‌భ స్పీక‌ర్‌కు కాంగ్రెస్ ఫిర్యాదు

పోలీసులు గ‌త మూడు రోజులు వ్య‌వ‌హ‌రించిన తీరుపై తాము లిఖిత‌పూర్వ‌కంగా ఫిర్యాదు చేశామ‌ని కాంగ్రెస్ నేత చిదంబ‌రం తెలిపారు. ఉభ‌య స‌భ‌ల ఎంపీల‌పై పోలీసులు దాడి చేశార‌ని ఆయ‌న అన్నారు. ఎంపీల‌ను అదుపులోకి తీసుకుని హ‌రియాణా స‌రిహ‌ద్దు వ‌ర‌కు తీసుకెళ్లార‌ని తెలిపారు. ఎటువంటి లిఖిపూర్వ‌క ప‌త్రాలూ చూప‌కుండా దాదాపు 12 గంట‌ల పాటు ఎంపీల‌ను పోలీసులు నిర్బంధించార‌ని ఆయ‌న ఆరోపించారు. ఎంపీల‌కు ఆహారం, నీళ్లు కూడా ఇవ్వ‌లేద‌ని చెప్పారు. త‌మ‌ను అరెస్టు చేశారా అని ఎంపీలు ప్ర‌శ్నిస్తే పోలీసులు స‌మాధానం చెప్ప‌లేద‌ని అన్నారు. స్వేచ్ఛ‌కు భంగం క‌లిగించేలా పోలీసులు వ్య‌వ‌హ‌రించార‌ని, ప్రాథ‌మిక హక్కుల‌కూ భంగం క‌లిగింద‌ని చెప్పారు.