AP Movie Theaters: నిన్న థియేటర్లు సీజ్.. నేడు స్వచ్ఛందంగా బంద్!

ఏపీలో ఇప్పుడు సినిమా టికెట్ల వ్యవహారం మరోసారి కాకరేపుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కొందరు సినిమా పెద్దలు..

AP Movie Theaters: నిన్న థియేటర్లు సీజ్.. నేడు స్వచ్ఛందంగా బంద్!

Ap Movie Theaters

AP Movie Theaters: ఏపీలో ఇప్పుడు సినిమా టికెట్ల వ్యవహారం మరోసారి కాకరేపుతున్న సంగతి తెలిసిందే. టికెట్ల ధరల తగ్గింపు వ్యవహారంలో ఏపీ ప్రభుత్వం సానుకూలంగా స్పందించాలని కొందరు సినిమా పెద్దలు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినా ప్రభుత్వం తగ్గేది లేదని భీష్మించుకు కూర్చుంది. ఈ వ్యవహారంపై కొందరు కోర్టుకు వెళ్లగా హైకోర్టు సానుకూలంగా స్పందించినా ఏపీ ప్రభుత్వం మాత్రం మరో బెంచ్ లో సవాల్ చేసి టికెట్ల ధరలను పెంచేదే లేదని తెగేసి చెప్పింది.

Pawan Kalyan: మరోసారి దేవుడిగా కనిపించనున్న పవర్ స్టార్?

దీనిపై గురువారం హీరో నానీ మరోసారి కీలక వ్యాఖ్యలు చేయగా.. నానీ వ్యాఖ్యలకు ఏపీ నుండి మంత్రులు, వైసీపీ ఎమ్మెల్యేలు కౌంటర్ల వ్యాఖ్యలు కూడా వచ్చాయి. అయితే..ఈ రోజుల్లో కూడా రూ.10, రూ.20ల టికెట్ల ధరలతో థియేటర్లను నడపలేమంటూ కొందరు థియేటర్ల యాజమాన్యాలు వాపోతున్నాయి. ప్రభుత్వ జీవోను కాదని అధిక రేట్లకు టికెట్లను విక్రయించిన థియేటర్లను ప్రభుత్వం బుధవారం సీజ్ చేయించింది. కృష్ణా జిల్లాలోనే దాదాపుగా పదికి పైగా థియేటర్లను సీజ్ చేసిన అధికారులు విజయనగరం జిల్లాలో మరో ఆరు థియేటర్లను సీజ్ చేశారు.

Upasana: ప్రధాని మోడీతో ఉపాసన.. అసలు విషయం ఏమిటంటే?

కాగా.. నేడు యాజమాన్యాలే స్వచ్ఛందంగా పలు చోట్ల థియేటర్లను మూసేస్తున్నట్లుగా సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్ అవుతున్నాయి. ముఖ్యంగా కృష్ణా, గోదావరి జిల్లాలలో థియేటర్ల యాజామామాన్యాలు మూకుమ్మడిగా ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు తెలుస్తుంది. ఒక్క గురువారమే యాభైకి పైగా థియేటర్లలో ప్రదర్శన నిలిపేసి స్వచ్ఛందంగా బంద్ చేసినట్లు తెలుస్తుంది. ఒకవైపు అధికారుల సీజ్, మరోవైపు యాజమాన్యాల స్వచ్ఛంద నిలిపివేతతో ఏపీలో సినిమా ప్రదర్శన పరిస్థితి అయోమయంగా మారింది. మరి ఈ సమస్య ఎప్పటికి పరిష్కారమవుతుందో చూడాలి.