OTT : ఓటీటీ ఊపు అయిపోయిందా?? సినిమాలకి ఇంకో ఇన్‌కం తగ్గనుందా??

కోవిడ్ కారణంగా ఓటీటీ వ్యూయర్షిప్ బాగా పెరిగింది. దాంతో ఓటీటీ సంస్థలు తెలుగు సినిమాలను భారీ రేట్స్ ఆఫర్ చేసి మరీ కొనుక్కున్నాయి. దీనివల్ల బడ్జెట్, హీరోలు....................

OTT : ఓటీటీ ఊపు అయిపోయిందా?? సినిమాలకి ఇంకో ఇన్‌కం తగ్గనుందా??

Ott

OTT :  తెలుగు సినిమాలకే కాదు, అన్ని సినిమాల బిజినెస్ కి ఓటీటీ ఫ్లాట్ ఫామ్స్ బాగా ఉపయోగపడ్డాయి. కరోనా ముందు వరకు థియేటర్ రైట్స్, టివి రైట్స్ కే పరిమితమైన సినిమాల మార్కెట్ కరోనా వల్ల ఓటీటీలతో మరింత బలపడింది. అయితే ఇన్నాళ్లూ భారీ రేట్లతో సినిమాలు కొన్న ఓటీటీ సంస్థలు ఇకపై పెద్ద మొత్తంలో చెల్లించే పరిస్థితి లేదని అంటున్నాయి. దాంతో ఓటీటీల ఆదాయం మీద కూడా ఆధారపడ్డ సినిమాలు రానున్న రోజుల్లో భారీ బడ్జెట్ పై ఆలోచించాల్సిందే.

కోవిడ్ కారణంగా ఓటీటీ వ్యూయర్షిప్ బాగా పెరిగింది. దాంతో ఓటీటీ సంస్థలు తెలుగు సినిమాలను భారీ రేట్స్ ఆఫర్ చేసి మరీ కొనుక్కున్నాయి. దీనివల్ల బడ్జెట్, హీరోలు, ఆర్టిస్టుల రెమ్యునరేష్ కూడా పెరిగింది. కాని ఇప్పుడు కరోనా ఆంక్షలన్నీ ఎత్తేయడంతో థియేటర్లలో సందడి బాగా పెరిగింది. కోవిడ్ టైమ్ లో విడుదల ఆగిపోయిన భారీ సినిమాలు RRR, రాధేశ్యామ్, KGF2, ఆచార్య, సర్కార్ వారి పాట, పుష్ప, అఖండ.. ఇలాంటి సినిమాలన్నీ రిలీజ్ అయిపోయాయి. మరిన్ని సినిమాలు రిలీజ్ కి రెడీగా ఉన్నాయి.

ఇలాంటి సమయంలో భారీ రేట్ కి ఓటీటీ సంస్థలు సినిమాలను కొనుగోలు చేయడం మూలంగా నష్టపోతున్నాయని పునరాలోచనలో పడ్డాయి. రాధేశ్యామ్ లాంటి పాన్ ఇండియా సినిమాకు అన్ని లాంగ్వేజెస్ తో కలిపి 250 కోట్లు చెల్లించింది అమెజాన్ ప్రైమ్. ఆ రేంజ్ బిజినెస్ ఇప్పుడు జరుగుతుందా? అని ఓటీటీ సంస్థలే ఆలోచనలో పడ్డాయి. టివి ఛానెల్స్ కి యాడ్స్ ఉంటాయి కాబట్టి ఎక్కువ రేటుకి శాటిలైట్ రైట్స్ కొనుక్కున్నా కవర్ చేయొచ్చు. కానీ ఓటీటీలకు ఆ అవకాశం లేదు. పోనీ ఎక్స్ ట్రా ప్రీమియంతో వర్కవుట్ చేసుకుందామనుకుంటే ఆల్రెడీ సబ్ స్క్రైబ్ చేసుకున్నాక ఇంకా అదనపు రేట్స్ ఎలా వసూలు చేస్తారని చందాదారుల నుంచి ఒత్తిడి వస్తుంది. ఇటీవల RRR, KGF సినిమాలకి ఇలా వ్యవహరించి విమర్శల పాలయ్యాయి ఓటీటీలు. ఒకవేళ కాదని కఠినంగా వ్యవహరిస్తే సబ్ స్క్రయిబర్సే తగ్గిపోయే పరిస్తితి ఓటీటీ సంస్థలకొచ్చింది.

Yami Gautam : సినిమాలే సర్వస్వం కాదు.. జీవితంలో ఒక భాగం మాత్రమే..

 

దీంతో సినిమాలను అంత రేట్స్ పెట్టి కొనకూడదని డిసైడ్ అయిపోయాయి. ఇక ముందు సినిమాలపై ఆధారపడకుండా అదే బడ్జెట్ తో సొంతంగా సిరీస్ లు తీసుకుని సబ్ స్క్రైబర్స్ ను ఎట్రాక్ట్ చేయాలని చూస్తున్నాయి ఓటిటి సంస్థలు. శాటిలైట్ రైట్స్, ఓటిటి రైట్స్, ఇతర డబ్బింగ్ రైట్స్, థియేట్రికల్ రైట్స్ ను దృష్టిలో ఉంచుకుని, బడ్జెట్లు, రెమ్యునరేషన్స్ పెంచేయడంతో సినిమా బడ్జెట్ కూడా బాగా పెరిగిపోయింది. మరిప్పుడు ఓటీటీలు పూర్తిగా రేట్స్ తగ్గించాలని, పే పర్ వ్యూ ఇవ్వాలని భావిస్తుండటంతో రెమ్యునరేషన్స్, బడ్జెట్స్ తగ్గించకపోతే మళ్ళీ సినిమా ఇండస్ట్రీ పరిస్థితి ప్రశ్నార్థకంగా మారే అవకాశం ఉంది.