MS Dhoni: నాకిది చివరి ఐపీఎల్ అని మీరు ఫిక్స్ అయ్యారు.. నేను కాదు : ఎంఎస్ ధోని
లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ సందర్భంగా రిటైర్‌మెంట్ వార్తలపై ధోని స్పందించాడు.

MS Dhoni
MS Dhoni: ఎంఎస్ ధోనికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అంతర్జాతీయ క్రికెట్‌కు 2020 ఆగస్టులో రిటైర్‌మెంట్ ప్రకటించాడు. కేవలం ఇండియన్ ప్రీమియర్ లీగ్(IPL) మాత్రమే ఆడుతున్నాడు. ధోని వయస్సు 41 సంవత్సరాలు. ప్రస్తుత సీజనే ధోనికి ఆఖరిది అని గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలను ఇప్పటి వరకు మహేంద్రుడు ఖండించకపోవడంతో మైదానంలో ధోనిని మళ్లీ చూస్తామో లేదోనని చెన్నై ఆడే మ్యాచ్‌లకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివస్తున్నారు.
IPL 2023, LSG vs CSK: పూరన్ ఔట్.. బదోని అర్ధశతకం..Live Updates
లక్నోలోని ఎకానా స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్ తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ టాస్ సందర్భంగా రిటైర్‌మెంట్ వార్తలపై ధోని స్పందించాడు. కామెంటేటర్ డాని మోరిసన్ మాట్లాడుతూ.. “మీకిది చివరి సీజన్ కదా.. ఎలా ఎంజాయ్ చేస్తున్నారు.” అని నవ్వుతూ అడిగారు. ఇంతకు ధోని చాలా కూల్‌గా నవ్వుతూ.. “నాకిది చివరి సీజన్ అని మీరు నిర్ణయించుకున్నారు. అయితే నేను మాత్రం అలా భావించడం లేదు.” అని సమాధానం ఇచ్చాడు. మళ్లీ డానీ మారిసన్ మాట్లాడుతూ.. ధోని 2024లో తిరిగి వస్తున్నట్లు ప్రేక్షకులకు ప్రకటించాడు. ధోని, మారిసన్ ఒకరిని ఒకరు చూసుకుంటూ నవ్వు కున్నారు.
IPL 2023: అక్షర్ పటేల్ పై ఆరోన్ ఫించ్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఈ విషయం విన్న కెప్టెన్ కూల్ అభిమానులు పుల్ ఖుషీ అవుతున్నారు. వచ్చే సీజన్‌లో కూడా ధోని ఆడుతాడని ఆనందం వ్యక్తం చేస్తున్నాడు. ఇప్పటి వరకు మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్‌లో 243 మ్యాచ్‌లను ఆడాడు. 135.9 స్ట్రైక్ రేట్‌తో 39.5 సగటుతో 5,052 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 84 నాటౌట్. 24 హాఫ్ సెంచరీలు అతడి పేరు పై ఉన్నాయి.