LGM Teaser : ధోని నిర్మిస్తున్న సినిమా రెడీ అయ్యింది.. టీజర్ రిలీజ్..
కెప్టెన్ కూల్ ఎంఎస్ ధోని నిర్మిస్తున్న మొదటి సినిమా టీజర్ ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. టీజర్ చాలా ఎంటర్‌టైనింగ్ గా కనిపిస్తుంది.

MS Dhoni Harish Kalyan Ivana LGM Movie Teaser released
MS Dhoni – LGM Teaser : ఇండియన్ కూల్ కెప్టెన్ ఎంఎస్ ధోని ఇటీవల సినిమా రంగంలోకి కూడా అడుగుపెట్టిన సంగతి తెలిసిందే. ధోని ఎంటర్టైన్మెంట్ లిమిటెడ్ పేరుతో ఒక నిర్మాణ సంస్థ స్థాపించి సౌత్ లో పలు సినిమాలు నిర్మించబోతున్నాడు. ఇక మొదటి సినిమాని తమిళ ఇండస్ట్రీలో నిర్మిస్తున్నాడు. కోలీవుడ్ యంగ్ హీరో హరీష్ కళ్యాణ్ (Harish Kalyan), లవ్ టుడే సినిమాతో మంచి ఫేమ్ ని సంపాదించుకున్న ఇవానా (Ivana) హీరోహీరోయిన్లుగా ఒక సినిమా ప్రకటించాడు.
Gandeevadhari Arjuna : డాడీ వెనకే అబ్బాయి.. రెండు వారాల గ్యాప్‌లో చిరు, వరుణ్ సినిమాలు..
ఇక ఈ చిత్రానికి LGM (లెట్స్ గెట్ మ్యారీడ్) అనే క్యాచీ టైటిల్ ని పెట్టి ఆసక్తిని కలగజేశాడు. జనవరి ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టిన చిత్ర యూనిట్.. గత నెల మేలో షూటింగ్ పూర్తి చేశారు. తాజాగా ఇప్పుడు ఈ మూవీ నుంచి టీజర్ ని రిలీజ్ చేసి ప్రమోషన్స్ కి తెరలేపారు. టీజర్ చాలా ఎంటర్‌టైనింగ్ గా కనిపిస్తుంది. త్వరలోనే మూవీ డేట్ అండ్ మరిన్ని అప్డేట్స్ కూడా రానున్నాయి.
Amitabh Bachchan : ఫ్యాన్స్ దగ్గరకి వచ్చేటప్పుడు అమితాబ్ చెప్పులు వేసుకోరు.. ఎందుకో తెలుసా?
రమేష్ తమిళమణి డైరెక్ట్ చేస్తున్న ఈ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ లో నదియా, యోగిబాబు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి మ్యూజిక్ డైరెక్టర్ కూడా రమేష్ తమిళమణినే చేస్తున్నాడు. ధోని నిర్మిస్తున్న మొదటి సినిమా కావడం ఇతర భాషల్లో కూడా మూవీ పై మంచి క్యూరియాసిటీ నెలకుంది. అయితే ప్రస్తుతానికి తెలుగు, తమిళ టీజర్స్ మాత్రమే రిలీజ్ చేశారు. మరి కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ సినిమా రిలీజ్ చేస్తారా? లేదా తెలుగు, తమిళ భాషలతో సరిపెడతారా చూడాలి.