Mukhachitram : విశ్వక్‌సేన్ ముఖ్యపాత్రలో.. ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ తో అదిరిపోయే థ్రిల్లర్.. ‘ముఖచిత్రం’ ట్రైలర్ రిలీజ్..

కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ కథతో కొత్త దర్శకుడు గంగాధర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా 'ముఖచిత్రం'. వికాస్ వశిష్ట హీరోగా ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ ముఖ్య పాత్ర...............

Mukhachitram : విశ్వక్‌సేన్ ముఖ్యపాత్రలో.. ప్లాస్టిక్ సర్జరీ కాన్సెప్ట్ తో అదిరిపోయే థ్రిల్లర్.. ‘ముఖచిత్రం’ ట్రైలర్ రిలీజ్..

Mukhachitram :  కలర్ ఫోటో డైరెక్టర్ సందీప్ రాజ్ కథతో కొత్త దర్శకుడు గంగాధర్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న సినిమా ‘ముఖచిత్రం’. వికాస్ వశిష్ట హీరోగా ప్రియా వడ్లమాని, అయేషా ఖాన్ హీరోయిన్స్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విశ్వక్ సేన్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. తాజగా ఈ సినిమా ట్రైలర్ ని విడుదల చేశారు.

ట్రైలర్ ఆద్యంతం సస్పెన్స్ థ్రిల్లర్ లా అనిపించింది. హీరో ఒక ప్లాస్టిక్ సర్జన్. ఒక అమ్మాయిని ప్రేమించి అనంతరం ఇంకో అమ్మాయిని పెళ్లి చేసుకోవాల్సి వస్తుంది. ఇద్దరు హీరోయిన్స్ కి ఒకేసారి యాక్సిడెంట్ జరగడంతో ఒకరు చనిపోగా మరొకరు చావు బతుకుల మధ్య ఉంటే ఒకరి ముఖాన్ని తీసి ఇంకొకరికి ప్లాస్టిక్ సర్జరీ చేస్తాడు హీరో. ఆ తర్వాత ఎదురైనా పరిస్థితులు ఏంటి? హీరోకి, వేరే వాళ్ళకి ఆ అమ్మాయి వల్ల ఎలాంటి కష్టాలు వచ్చాయి. ఇది కోర్టు దాకా వెళ్లడంతో కోర్టులో ఏం జరిగింది అనే అంశంతో థ్రిల్లర్ లా ట్రైలర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.

Bruce Lee : ‘లైఫ్ అఫ్ పై’ డైరెక్టర్ దర్శకత్వంలో.. బ్రూస్లీ బయోపిక్ త్వరలో..

విశ్వక్ సేన్ ఇందులో లాయర్ గా కనిపించనున్నాడు. ట్రైలర్ ఆసక్తిగా ఉండటం, విశ్వక్ సేన్ ఉండటం, కలర్ ఫోటో డైరెక్టర్ రాసిన కథ కావడంతో సినిమాపై అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా డిసెంబర్ 9న థియేటర్స్ లో రిలీజ్ కానుంది.