Delhi, Mumbai : శాంసంగ్​ కార్యాలయాలపై డీఆర్​ఐ ఆకస్మిక దాడులు

శాంసంగ్ కార్యాలయాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిందన్న అనుమానాలతో ముంబై, ఢిల్లీల్లోన ఉన్న శాంసంగ్ కార్యాలపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు.

Delhi, Mumbai : శాంసంగ్​ కార్యాలయాలపై డీఆర్​ఐ ఆకస్మిక దాడులు

Samsung Offices Searched By Dri Over Suspicion

Samsung offices searched by DRI over suspicion : శాంసంగ్ కార్యాలయాలపై డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (DRI) అధికారులు దాడులు నిర్వహించారు. కస్టమ్స్ సుంకాన్ని ఎగవేసిందన్న అనుమానాలతో ముంబై, ఢిల్లీల్లోన ఉన్న శాంసంగ్ కార్యాలపై డీఆర్ఐ అధికారులు సోదాలు నిర్వహించారు. ఇటీవలే శాంసంగ్ కంపెనీ నెట్ వర్క్ పరికరాలను దిగుమతి చేసుకుందని..వాటిని సక్రమంగా కాకుండా..అడ్డదారిలో తెచ్చారని అధికారులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలో నిజనిర్ధారణ చేసుకోవటానికి ఆకస్మిక తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది.

ఈక్రమంలో నెట్ వర్కింగ్ విధులు జరిగే ముంబై ఆఫీసు, ఢిల్లీలోని గురుగ్రామ్ లో ఉన్న ఇండియా ప్రధాన కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించినట్లుగా తెలుస్తోంది. బుధవారం (జులై 8,2021) జరిగిన ఈ దాడుల్లో దిగుమతులకు సంబంధించిన కొన్ని కీలక పత్రాలను డీఆర్ఐ అధికారులు పరిశీలించారు. అన్ని డాక్యుమెంట్స్ ను క్షుణ్ణంగా పరిశీలించాక శాంసంగ్ సుంకాన్ని ఎగవేసిందా? లేదా? అన్నది తేల్చనున్నట్టు సమాచారం. డీఆర్ఐ అధికారులు తమ ఆఫీసులపై తనిఖీలు నిర్వహించినట్లుగా శాంసంగ్ ఎటువంటి ప్రకటనా చేయలేదు.

దేశంలో 4జీ పరికరాల అతిపెద్ద విక్రయదారు శాంసంగే కావటం విశేషం. శాంసంగ్ రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ తో పాటు పలు సంస్థలకు 4జీ పరికరాలను సరఫరా చేస్తున్న సంస్థ. శాంసంగ్ సొంత దేశమైన దక్షిణ కొరియాతో పాటు, వియత్నాంలలో తయారు చేసిన టెలికం పరికరాలు, ఇతర ఉత్పత్తులపై స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం (ఎఫ్టీఏ) కింద సంస్థకు కస్టమ్స్ సుంకం నుంచి మినహాయింపు ఉంది. అందులో భాగంగా టెలికం సేవలు, నెక్ట్స్ జెన్ వైర్ లెస్ నెట్ వర్క్ ల డెవలప్ మెంట్, ఆధునికీకరణ, విస్తరణ వంటి విషయాల్లో పరస్పర సహకారం కోసం భారత్, దక్షిణ కొరియాల మధ్య ఎఫ్టీఏ కుదిరింది.

ఈక్రమంలో శాంసంగ్ ఇటీవల దిగుమతి చేసుకున్న పరికరాలు దక్షిణ కొరియాలోగానీ, వియత్నాంలోగానీ తయారు కాలేదని కేంద్ర ప్రభుత్వానికి సమాచారం అందింది. ఎఫ్టీఏలో భాగం కాని దేశంలో వాటిని తయారు చేసి వాటిని కొరియా, వియత్నాంల మీదుగా భారత్ లోకి తీసుకొచ్చారని ఓ అధికారి ఇచ్చిన సమాచారం ఇచ్చారు. ఈ సమాచారం నిజమైతే దిగుమతి చేసుకున్న పరికరాలపై కచ్చితంగా కష్టమ్స్ విధించవచ్చు.