Scrub Typhus In HYD : హైదరాబాద్ లో వింత వ్యాధి..ఇళ్లల్లో ఉండే పురుగు వల్ల పిల్లలకు సోకుతున్న వ్యాధి

హైదరాబాద్‌ నరగంలో ‘స్క్రబ్‌ టైఫస్‌’ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తోంది. చిన్న పిల్లలకు ఎక్కువగా సోకుతోందని ఇళ్లల్లో ఉండే చిన్న సైజులో ఉండే పురుగుద్వారా ఈ వింత వ్యాధి వ్యాపిస్తోంది

Scrub Typhus In HYD : హైదరాబాద్ లో వింత వ్యాధి..ఇళ్లల్లో ఉండే పురుగు వల్ల పిల్లలకు సోకుతున్న వ్యాధి

Scrub Typhus In Hyd

Scrub Typhus In HYD : తెలంగాణలో ఓ పక్క కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు పెరుగుతుంటే మరోపక్క నగరవాసుల్ని ఓ వింత వ్యాధి కలవర పెడుతోంది. చాపకింద నీరులా ఈ వింత వ్యాధి వ్యాపిస్తోంది. మన ఇళ్ల పరిసరాల్లో ఉండే చిన్న సైజులో ఉంటే ఓ పురుగు ద్వారా ఈ వ్యాధి వ్యాపిస్తు భయపెడుతోంది. ముఖ్యంగా చిన్నపిల్లలకే ఈ వింత వ్యాధి సోకుదోంది అంటున్నారు నిపుణులు. అదే ‘స్క్రబ్‌ టైఫస్‌’. ఈ వింత వ్యాధితో ఇప్పటికే గాంధీ హాస్పిటల్లో 15మంది చికిత్స పొందుతున్నారు. హైదరాబాద్‌ నరగంలో ‘స్క్రబ్‌ టైఫస్‌’ చాపకింద నీరులా వ్యాపిస్తోందంటున్నారు నిపుణులు.

Read more : Omicron : అమెరికాలో ఒమిక్రాన్ పంజా.. 73శాతం కేసులతో డెల్టాను దాటేసింది!

గత కొన్ని రోజులుగా గాంధీ హాస్పిటల్లో 15 మంది ఈ స్క్రబ్‌ టైఫస్‌ లేదా బుష్‌ టైఫస్‌కు చికిత్స తీసుకున్నట్లుగా తెలుస్తోంది. బాధితుల్లో ఎక్కువ మంది పిల్లలే ఉండటం ఆందోళన చెందాల్సిన విషయం. డిసెంబర్ లో ఈ స్క్రబ్‌ టైఫస్‌ సోకి నలుగురు చిన్నారులు గాంధీ ఆసుపత్రిలో చేరారు. వీరిలో ఇద్దరికి తగ్గిపోగా.. మరో ఇద్దరు చికిత్స పొందుతున్నారు.

స్క్రబ్‌ టైఫస్‌ ఎలా సోకుతుందంటే..
ఇళ్లలో, పెరటి మొక్కల్లో, చిత్తడి ప్రాంతాల్లో ఉండే నల్లి వంటి చిన్న పురుగులు(లార్వల్‌ మైట్స్‌) కుట్టడం ద్వారా ఈ స్క్రబ్‌ టైఫస్‌ వ్యాధి సోకుతుంది. మన ఇళ్లల్లోనే మంచాల్లోను ఇతర చెక్క సామాన్లతో పాటు..తడి తడిగా ఉండే ప్రాంతాల్లో ఈ పురుగులు ఆవాసంగా ఉంటుంటాయి. అచ్చంగా మంచాల్లో ఉండే నల్లుల్లా ఈ పురుగులు ఉంటాయి. నల్లుల్లాగానే ఈ పురుగులు తిరుగుతుంటాయి.

Read more : James Webb Space Telescope : అంతరిక్షంలోకి టైమ్ మెషిన్..విశ్వం పుట్టుక గుట్టు విప్పే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్‌..

ముఖ్యంగా ఈ పురుగులు అంతదు సద్దుమణిగాక రాత్రి సమయాల్లో ఎక్కువగా కుడుతుంటాయి. ఇవి కుడితే తీవ్రమైన జ్వరం, ఒళ్లు, కండరాల నొప్పులు వస్తాయి. కొందరికైతే..శరీరంపై దద్దుర్లు కూడా వస్తాయి. కాబట్టి ఇటువంటి లక్షణాలుంటే వెంటనే ఏమాత్రం ఆలస్యం గానీ నిర్లక్ష్యంగానీ చేయకుండా డాక్టర్లను సంప్రదించి వారి సూచనల మేరకు చికిత్స తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.