Aha : ఆహా సమర్పణలో అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాగ చైతన్య..

అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న థ్రిల్లర్.. ‘థ్యాంక్ యు బ్రదర్!’.. ఈ చిత్రాన్ని పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమర్పిస్తోంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాధ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసిన ‘థ్యాంక్ యు బ్రదర్!’ థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రానా దగ్గుబాటి, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకి తమ సపోర్ట్ అందించారు..

Aha : ఆహా సమర్పణలో అనసూయ ‘థ్యాంక్ యు బ్రదర్’.. రిలీజ్ డేట్ అనౌన్స్ చేసిన నాగ చైతన్య..

Aha

Aha: అనసూయ, అశ్విన్ విరాజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న థ్రిల్లర్.. ‘థ్యాంక్ యు బ్రదర్!’.. ఈ మూవీని పాపులర్ తెలుగు ఓటీటీ ‘ఆహా’ సమర్పిస్తోంది. జస్ట్ ఆర్డినరీ ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై మాగుంట శరత్ చంద్రా రెడ్డి, తారక్‌నాధ్ బొమ్మిరెడ్డి నిర్మిస్తున్నారు. రమేష్ రాపర్తి డైరెక్ట్ చేస్తున్నారు. విక్టరీ వెంకటేష్ రిలీజ్ చేసిన ‘థ్యాంక్ యు బ్రదర్!’ థియేట్రికల్ ట్రైలర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. రెబల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు, రానా దగ్గుబాటి, సుప్రీం హీరో సాయి ధరమ్ తేజ్ ఈ సినిమాకి తమ సపోర్ట్ అందించారు.

Thank You Brother

ప్లే బాయ్ లాంటి అభి అనే ఓ యువ‌కుడు, ప్రెగ్నెంట్ అయిన ప్రియ అనే యువ‌తి ఓ లిఫ్ట్‌లో ఉండ‌గా ప‌వ‌ర్ పోతుంది.. అందులో చిక్కుకుపోయిన‌ప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఎదురయ్యాయనేది సినిమా కథ అని ట్రైలర్‌లో క్లుప్తంగా చూపించి సినిమాపై ఇంట్రెస్ట్ క్రియేట్ చేశారు. ప్రెగ్నెంట్ వుమెన్‌గా అనసూయ నేచురల్ పర్ఫార్మెన్స్‌తో ఆకట్టుకుంది. లిఫ్ట్‌లో స్టక్ అయిపోయిన గర్భవతి ఎలాంటి ఇబ్బందులు పడుతుందో అలా అనసూయ తన నటనతో భావోద్వేగానికి గురి చేస్తూ కంటతడి పెట్టించారు..

ఫ్యామిలీ ఆడియెన్స్ కనెక్ట్ అయ్యే ఎమోషన్స్, సస్పెన్స్, థ్రిల్లింగ్, క్లైమాక్స్, విజువల్స్, మ్యూజిక్, ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాలో ఆకట్టుకుంటాయని మూవీ టీం కాన్ఫిడెంట్‌గా చెప్తున్నారు..
ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు చివరిదశకు చేరుకున్నాయి. రీసెంట్‌గా ఈ సినిమా రిలీజ్ డేట్ యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య అనౌన్స్ చేశారు. ఏప్రిల్ 30న ‘థ్యాంక్ యు బ్రదర్!’ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు రిలీజ్ డేట్‌తో కూడిన పోస్టర్ ట్వీట్ చేస్తూ.. యూనిట్ అందరికీ విషెస్ తెలిపారు చైతన్య..