నాగ చైతన్య కోసం నదిలో దూకిన అభిమాని..

నాగ చైతన్య కోసం నదిలో దూకిన అభిమాని..

Naga Chaitanya: యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోగా.. ‘ఇష్క్’, ‘మనం’, ‘24’ వంటి వైవిధ్యమైన చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో, ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెకంటేశ్వర క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న చిత్రం “థ్యాంక్యూ”.. నాగచైతన్య హీరోగా నటిస్తున్న 20వ చిత్రమిది. రైటర్ కమ్ డైరెక్టర్ బి.వి.ఎస్.రవి కథ, మాటలు అందిస్తున్నారు.

NC 20

ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ఈస్ట్ గోదావరిలో జరుగుతోంది.. చైతన్య వచ్చాడని తెలుసుకున్న అక్కినేని అభిమానులు ఆ ప్రాంతంలో సందడి చేస్తున్నారు. తమ అభిమాన హీరోను కలిసి మాట్లాడేందుకు, ఫొటోలు తీసుకునేందుకు పెద్ద ఎత్తున షూటింగ్ స్పాట్‌కి చేరుకున్నారు. చైతు వచ్చిన వారినందర్నీ కలిసి ఫొటోలు దిగారు.

NC 20

చైతు బస చేసిన హోటల్ వద్దకు అక్కినేని సీనియర్ ఫ్యాన్స్ చేరుకుని పూల దండలతో సత్కరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు. తాజాగా ఓ వీరాభిమాని వాటర్ లో షూటింగ్ జరుగుతుండగా చైతుని చూడడం కోసం నదిలోకి దూకేశాడు.

షూటింగ్ ప్యాకప్ చెప్పిన తర్వాత చైతుని ఆ అభిమానిని కలిశాడు. ఇంకెప్పుడూ ఇలాంటి పిచ్చి పనులు చెయ్యొద్దని చెప్పి, కాసేపు తనతో మాట్లాడి, ఫొటో ఇచ్చి పంపారు చైతన్య.. తన అభిమాన హీరోని కలిసే అవకాశం వచ్చినందుకు ఎంతో పొంగిపోయాడు చైతన్య ఫ్యాన్.. చైతు కోసం అభిమాని నీళ్లల్లో దూకిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.