Bigg Boss 5 Telugu : రవి నిజ స్వరూపం బయట పెట్టిన నాగార్జున..

హోస్ట్ నాగార్జున లహరికి యాంకర్ రవి తన గురించి చులకనగా మాట్లాడిన వీడియో చూపించారు..

Bigg Boss 5 Telugu : రవి నిజ స్వరూపం బయట పెట్టిన నాగార్జున..

Anchor Ravi

Updated On : September 26, 2021 / 12:48 PM IST

Bigg Boss 5 Telugu : వరల్డ్స్ బిగ్గెస్ట్ రియాలిటీ షో ‘బిగ్ బాస్’ తెలుగు సీజన్ 5 రసవత్తరంగా సాగుతోంది. ఫస్ట్ వీక్ సెవన్ ఆర్ట్స్ సరయు, రెండో వారం క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఉమా దేవి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఈవారం ఎవరు ఎలిమినేట్ అవుతారు.. ఎవరు ఎవర్ని నామినేట్ చేస్తారోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు బిగ్ బాస్ ఆడియన్స్.

Bigg Boss 5 Telugu : ప్రియ కామెంట్స్‌పై రవి భార్య రియాక్షన్.. ఫ్యాన్స్ ఏమంటున్నారంటే..

ఇక నిన్నటి ఎపిసోడ్‌లో నాగార్జున.. యాంకర్ రవి నిజ స్వరూపాన్ని బయట పెట్టడంతో లహరి.. నాగార్జునకు థ్యాంక్స్ చెప్పింది.. వివరాళ్లోకి వెళ్తే.. రవి.. లహరి యాంకరింగ్ కోసం ట్రై చేస్తుందని, అందుకే ఇంట్లో ఉన్న మిగతా మగ వాళ్లను వదిలేసి, పెళ్లైన తన వెనుకే పడుతుందని అన్నాడు.

Vellampalli Srinivas : పవన్‌కళ్యాణ్ పిచ్చిపిచ్చి ప్రేలాపనలు మానుకోవాలి : మంత్రి వెల్లంపల్లి

రవి, ప్రియ పేర్లు రాసి ఉన్న టైల్స్‌ను సుత్తితో పగలగొట్టిన నాగార్జున.. వీళ్లిద్దరి గొడవలో బాధితురాలుగా మారిన లహరికి నిజం ఏంటో తెలియజెయ్యాలని ఆమెను కన్ఫెషన్ రూంలోకి పిలిచారు. లహరికి రవి తన గురించి మాట్లాడిన వీడియో చూపించారు. రవి తన గురించి అలా మాట్లాడడం చూసి లహరి షాక్ అయింది. అతని నిజ స్వరూపం బయటపెట్టినందుకు నాగార్జునకు థ్యాంక్స్ చెప్పింది.

Ghost Movie : కింగ్ పక్కన కాజల్ బదులు జాక్వెలిన్..